TSRTC Employees Merger Bill: ఆర్టీసీ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం, డీజిల్ ధరల భారం వల్లనే నష్టాల్లోకి ఆర్టీసీ, కార్పొరేషన్ కొనసాగుతుంది, ఆస్తులు ఆర్టీసీ పేరుమీదనే ఉంటాయని స్పష్టం చేసిన సీఎం కేసీఆర్
Representational (Credits: TSRTC)

Hyderabad, Aug 06: తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఉద్యోగుల విలీన బిల్లుకు (Tsrtc Employees Merger Bill) అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గవర్నర్‌ తమిళిసై మధ్యాహ్నం బిల్లుకు ఆమోదం తెలుపడంతో వీలిన ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఆ తర్వాత రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా (Tsrtc Employees Merger Bill) ఆమోదం తెలిపారు. అంతకుముందు ఆర్టీసీ విలీనంపై శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ (Cm KCR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పరిస్థితుల్లో సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాల్సి వస్తున్నదో వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలోకి తీసుకోవడంపై తెలిసీ తెలియక మాట్లాడుతున్నారు. గవర్నర్‌ సైతం తెలిసీతెలియక అనవసరంగా వివాదం కొనితెచ్చుకున్నారు. ఆర్టీసీ పెట్టిందే ప్రజలకు ప్రజారావాణా ఉండాలని. కాలక్రమేణా సంస్థ నష్టాల్లోకి కూరుకుపోవడం జరిగింది. నేను కూడా రవాణాశాఖ మంత్రిగా పని చేశాను. నేను మంత్రిగా బాధ్యతగా పని చేసినరోజు ఆ నాటి ఏపీఎస్‌ ఆర్టీసీ రూ.14కోట్ల నష్టాల్లో ఉండేది. ఆ నష్టాన్ని పూడుస్తూ వివిధ రకాల ప్రక్రియలు ప్రవేశపెట్టి రూ.14కోట్ల ఆదాయం తీసుకువచ్చాం. శక్తి సామర్థ్యాలు ఉంటే నష్టాలను పూడ్చవచ్చు. ఇటీవల డీజిల్‌ ధర భారీగా పెరిగింది. గతంలో ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు.

MLA Raja Singh: ఎన్నికల తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతానో లేదో, సొంతవాళ్లే ఓడించే అవకాశం ఉంది, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు 

ప్రభుత్వంలోకి తీసుకోవాలని కోరారు. మేము డబ్బులిస్తాం నడపాలి.. లాభాలను తీసుకువచ్చే ప్రయత్నం చేయమని చెప్పాం. బెస్ట్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ను ఎండీగా నియమించాం. మంచి అనుభవం ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి చైర్మన్‌గా నియమించాం. ఇద్దరు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎంత చేసినా అబ్‌నార్మల్‌ డీజిల్‌ రేటు ఇబ్బంది పెడుతున్నది. మన బస్సులు 40లక్షల కిలోమీటర్ల తిరుగుతయ్‌. 6లక్షల డీజిల్‌ కాలుతుంది. రూ.60 ఉండే డీజిల్‌ రూ.105కి చేరింది. రూ.45పెరిగే రోజుకు రూ.2.50కోట్లు డీజిల్‌పై నష్టం వస్తున్నది. ఇట్లయితే సంస్థ ఎలా ముందటపడాలి. మొన్న కేబినెట్‌లో అందరం ఐదారున్నర గంటలు చర్చించి.. గతంలో ప్రభుత్వంలోకి వద్దనుకున్నాం.. ఇప్పుడేం చేయాలి అని చర్చించాం. చర్చల్లో తేలిందేంటంటే.. దాచేది ఏమీ లేదు. ప్రజలకు రవాణా సదుపాయం కల్పించడం ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వానికైనా సోషల్‌ అబ్లికేషన్‌.

Ram Shankar Katheria Gets Jail Term: కేంద్రమాజీ మంత్రి బీజేపీ ఎంపీ రామ్‌శంకర్ కతేరియాకు రెండేళ్లు జైలుశిక్ష, లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడే అవకాశం 

ఆర్టీసీని తీసివేద్దామంటే.. తీసియేడానికి లేదు. ఆర్టీసీ బెస్ట్‌ స్కిల్‌ ఉన్న సంస్థ. జీరో యాక్సిడెంట్‌ ఫ్రీ ఉండే సంస్థ, ప్రజలను క్షేమంగా చేర్చే సంస్థ. మనమే విద్యార్థులకు లక్షల్లో పాసులు జారీ చేస్తున్నాం. ప్రజలు సైతం బస్సులు ఉండాలని కోరుకుంటారు. ఆర్టీసీ సంస్థ మనుగడ సాధించే పరిస్థితి లేదు. ప్రభుత్వమే సాకాలి. చివరకు కేబినెట్‌లో తేలిదంటే ఆర్టీసీకి సంవత్సరానికి రూ.1500కోట్లు ఇస్తున్నాం. గవర్నమెంట్‌లో లేదన్నటే కానీ.. సాదేది ప్రభుత్వమే. కాబట్టి ప్రజలకు తప్పకుండా ప్రజారవాణా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వంలోకి తీసుకున్నాం. కార్మికులకు భద్రత వస్తుందని భావించి కేబినెట్‌లోకి తీసుకున్నాం. వద్దన్నవాళ్లే ఎలా తీసుకుంటురని మాట్లాడే పిచ్చోళ్లు సైతం బయట ఉన్నరు. వాళ్లతో సంబంధం పెట్టుకోలేదు. ఏ పని చేసినా ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. లోతైన దృక్పథం, పరిశీలన ఉంటుంది. మనమే ప్రభుత్వమే డబ్బులు పెట్టి.. ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను నియమించి బాగా పని చేద్దామని, నష్టాలను ఎలాగైనా భరిస్తున్నాం కాబట్టి.. ప్రభుత్వంలోకి తీసుకున్నాం.

కొందరు దుర్మార్గంగా, నీచులు రాజకీయాల్లో ఉంటారు. ఆర్టీసీ ఆస్తులపై కన్నేశామని మాట్లాడుతున్నరు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటదా? ఏం చేసిన అడ్డం పొడువు మాట్లాడుతమంటే దుఃఖం కలిగిస్తుంది. ఆర్టీసీ సేవలు పెంచుతాం, బస్టాండ్లను ఆధునికీకరిస్తాం. ఇంకా పదెకరాల స్థలం తీసుకొని.. ప్రభుత్వపరంగా ఎన్ని డిపోలు కట్టిస్తున్నాం. అక్బరుద్దీన్‌ బండ్లగూడలో డిపో కావాలని కోరుతున్నారు. చిల్లర మాటలు పట్టించుకోం. ప్రభుత్వానికో బాధ్యత ఉంటుంది. సమాజానికి జవాబుదారులం. ప్రజలకు ప్రజారవాణాను అందుబాటులో ఉంచడం.. ప్రజాస్వామిక ప్రభుత్వం బాధ్యతగా గుర్తించి.. కేబినెట్‌లో చర్చించి ప్రభుత్వంలోకి తీసుకోవాలని బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నాం. వారికి పీఆర్సీ ఇస్తాం. ఆర్టీసీ 43వేల ఉద్యోగులకు సైతం పీఆర్సీ పెరుగుతుంది. వారు సంతోషంగా ఉంటారు’ అన్నారు.