Telangana Assembly Election 2023 Live Updates: తెలంగాణలో ఎన్నికల పోలింగ్ (Telangana Elections 2023) అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటు వేసేందుకు ఉదయం 7 గంటల నుంచే బారులు తీరారు. సీనీ, రాజకీయ ప్రముఖులు కుటుంబాలతో సహా పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటు వేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.80 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 20.79 శాతం పోలింగ్ నమోదైంది.
ఆదిలాబాద్‌లో 41.88 శాతం, భద్రాద్రిలో 39.29 శాతం, హన్మకొండలో 35.29 శాతం, జగిత్యాలలో 46.14 శాతం, జనగామలో 44.31 శాతం, భూపాలపల్లిలో 49.12 శాతం, గద్వాల్‌లో 49.29 శాతం, కామారెడ్డిలో 40.78 శాతం, కరీంనగర్‌లో 40.73 శాతం, ఖమ్మంలో 42.93 శాతం, ఆసిఫాబాద్‌లో 42.77 శాతం, మహబూబాబాద్‌లో 46.89 శాతం, మహబూబ్‌నగర్‌లో 44.93 శాతం, మంచిర్యాలలో 42.74 శాతం, మేడ్చల్‌లో 26.70 శాతం, ములుగులో 45.69 శాతం, నాగర్ కర్నూల్‌లో 39.58 శాతం, నల్గొండలో 39.20 శాతం, నారాయణపేటలో 42.60 శాతం, నిర్మల్‌లో 41.74 శాతం, నిజామాబాద్‌లో 39.66 శాతం, పెద్దపల్లిలో 44.49 శాతం, సిరిసిల్లలో 39.07 శాతం, రంగారెడ్డిలో 29.79 శాతం, సంగారెడ్డిలో 42.17 శాతం, సిద్దిపేటలో 44.35 శాతం, సూర్యాపేటలో 44.14 శాతం, వికారాబాద్‌లో 44.85 శాతం, వనపర్తిలో 40.40 శాతం, వరంగల్‌లో 37.25 శాతం, యాదాద్రిలో 45.07 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
సీఎం కేసీఆర్ (KCR) ఓటు హక్కు వినియోగించుకున్నారు. (Telangana Elections 2023) తన సతీమణి శోభతో కలిసి సిద్దిపేట జిల్లా చింతమడకకు వెళ్లిన సీఎం.. అక్కడి పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం ఓటర్లకు అభివాదం చేసుకుంటూ ఆయన వెళ్లిపోయారు.