Pawan Kalyan and PM Modi (Photo-X)

Hyd, Nov 7: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బలమైన నాయకుడు, దేశ ప్రయోజనాలే ముఖ్యం అనుకునే లీడర్ అంటూ ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేశారు. బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడానికి ధైర్యం ఉండాలని, ఆ ధైర్యం బీజేపీ చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

సామాజిక తెలంగాణ... బీసీ తెలంగాణకు తాను పూర్తిగా మద్దతిస్తున్నానన్నారు. తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా? అన్నది పెద్ద ప్రశ్న అన్నారు. సకల జనులు ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు. జల్... జంగల్... జమీన్ అంటూ కొమురం బీమ్ పోరాడారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగడం లేదన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్ 370 రద్దు చేసి ఉండేవారు కాదని, మహిళా బిల్లు తెచ్చేవారు కాదన్నారు. ఎన్నికలనే దృష్టిలో పెట్టుకొని ఉంటే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునే వారు కాదన్నారు.

ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయన్నారు. తనలాంటి కోట్లాదిమంది కన్న కలలకు ప్రతిరూపమే మోదీ అన్నారు. అంతర్జాతీయస్థాయిలో భారత్‌ను ప్రధాని అగ్రగామిగా నిలిపారన్నారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ధైర్యం నింపిన వ్యక్తి అని అన్నారు. అలాంటి ప్రధానికి తాము అండగా ఉంటామన్నారు. దేశ ప్రయోజనాలే మోదీని నిర్దేశిస్తాయని ఎన్నికల ప్రయోజనాలు కాదన్నారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారన్నారు. ఔర్ ఏక్ బార్ మోదీ అంటూ నినదించారు.

తెలంగాణకు బీసీనే ముఖ్యమంత్రి, బీజేపీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు, ప్రధాని స్పీచ్ హైలెట్స్ ఇవిగో..

సకల జనులు సమరం చేస్తే తెలంగాణ వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జల్, జంగల్, జమీన్ అంటూ కుమురం భీం పోరాడారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగించిన సమరం తెలంగాణ ఉద్యమమని.. తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందని పరిస్థితి నెలకొందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా అన్నదే ప్రశ్న అంటూ పవన్‌ పేర్కొన్నారు.

ప్రధాని మోడీ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్ 370 రద్దు చేసేవారు కాదన్నారు. ఎన్నికలనే మోదీ దృష్టిలో పెట్టుకుంటే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునేవారు కాదన్నారు. ఎన్నికలనే మోడీ దృష్టిలో పెట్టుకుంటే మహిళా బిల్లు తెచ్చేవారు కాదన్నారు. దేశ ప్రయోజనాలే ప్రధాని మోడీని నిర్ధేశిస్తాయి తప్పు, ఎన్నికల ప్రయోజనాలు కాదన్నారు. బీసీలను సీఎం చేస్తామని చెప్పిన పార్టీ బీజేపీ అంటూ చెప్పుకొచ్చారు. అంతర్జాతీయంగా భారత్‌ను అగ్రగామిగా నిలబెట్టింది మోడీ అని పవన్‌ వెల్లడించారు. ప్రతి భారతీయుడి గుండెలో ధైర్యం నింపిన నేత మోడీ అంటూ కొనియాడారు.

దేశ వ్యాప్తంగా బాణసంచా అమ్మకాలు బ్యాన్, కాలుష్యాన్ని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన సుప్రీంకోర్టు

నాలాంటి కోట్ల మంది కన్నకలలకు ప్రతిరూపమే నరేంద్ర మోడీ అంటూ పవన్‌ కళ్యాణ్ వెల్లడించారు. మూడు దశాబ్దాల ప్రగతిని మోదీ ఒకే దశాబ్దంలో సాధించారని.. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడం కష్టమన్నారు. మళ్లీ నరేంద్ర మోడీయే ప్రధాని కావాలని ఆకాంక్షించారు. బీజేపీకు జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానికి అండగా నిలబడతామన్నారు. భాగవతం పుట్టిన నేలలో బతుకు భారం కాకూడదన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉగ్రదాడులు తగ్గిపోయాయన్నారు.