Hyd, July 25: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. రెండో రోజు సభలో మాజీ మంత్రి హరీష్ రావు - మంత్రి శ్రీధర్ బాబు మధ్య మాటల యుద్దం జరుగగా ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి - కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. సభకు ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలని సీఎం రేవంత్ డిమాండ్ చేయగా, తాము వస్తే చాలని, కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని కేటీఆర్ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 2 వరకు జరగనున్నాయి. ఇవాళ సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. శాసనసభలో ఉదయం 9 గంటలకు కేబినెట్ భేటీ అయి బడ్జెట్‌ను అమోదించనుండగా మధ్యాహ్నం 12 గంటలకు భట్టి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇక మండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బడ్జెటన్‌ను ప్రవేశపెట్టనున్నారు.
బీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం ఇవాళ అసెంబ్లీకి మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కేసీఆర్ సభకు హాజరైతే బీఆర్ఎస్ అధికారం కొల్పోయిన తర్వాత తొలిసారి సమావేశాలకు వచ్చినట్లు అవుతుంది.
26న అసెంబ్లీకి సెలవు కాగా 27న బడ్జెట్ పై చర్చ జరగనుంది. 28న ఆదివారం సెలవు కాగా 29, 30 తేదీల్లో వివిధ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ నెల 31న ద్రవ్యవినిమయ బిల్లు సభ ముందుకు తీసుకురానుండగా ఆగస్టు 1, 2 తేదీల్లో వివిధ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. రెండోరోజు సభలో కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల వివక్ష చూపారని సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా దీనిని సభ అమోదించింది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు సీఎం రేవంత్. మొత్తంగా ఆరోపణలు, ప్రత్యారోపణలతో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. సహనం కొల్పోయిన సీఎం నితీష్ కుమార్, మహిళా ఎమ్మెల్యేపై సీరియస్, నువ్వు స్త్రీవి, నీకు ఏమీ తెలియదు?అంటూ మండిపాటు