Hyd, July 24: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. రెండో రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి - మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే చర్చ సందర్భంగా కేటీఆర్ - రేవంత్ పరస్పరం దూషించుకున్నారు.
తండ్రులు, తాతలు పేర్లు చెప్పుకొని రాలేదని కేటీఆర్‌కు చురకలు అంటించారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటా అనుకున్న కానీ అబ్సెంట్ ల్యాండ్ లార్డ్ అని తెలిసిందని, మొన్న ఢిల్లీకి వెళ్లి రహస్యంగా మాట్లాడుకున్నదే మీ అభిప్రాయమా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ - బీజేపీ చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు.
మా నాన్న నాకు చదువు లేకపోయినా మంత్రి పదవి ఇవ్వలేదు, మేము స్వయం కృషితో పైకి వచ్చాం అని చెప్పారు. జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా,ఎంపీగా, ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాని చెప్పారు. ఇక దీనికి కేటీఆర్ సైతం స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇచ్చారు. ఇక్కడున్న నాయకుడి స్థాయికి మేము చాలని, మీ స్థాయి ఏంటో మాకు తెలుసు అన్నారు. సభకు కేసీఆర్ రానవసరం లేదన్నారు. సీఎంకు ఓపిక ఉండాలని, పేమెంట్ కోటాలో రాలేదని నేను కూడా అనొచ్చు అని రేవంత్‌కు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. సీఎం వ్యాఖ్యలు రాజీవ్ గాంధీని అంటున్నారా? రాహుల్ గాంధీని అంటున్నారా? చెప్పాలన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకోవడంతో వీరిద్దరి మధ్య గొడవ సద్దుమణిగింది. రెండో రోజు సభకు రాని కేసీఆర్, ఆర్టీసీపై సభలో రగడ, హరీష్ - మంత్రి శ్రీధర్ మధ్య మాటల యుద్ధం