Gnanendra Prasad Dies: హైదరాబాద్‌లో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నేత, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న మియాపూర్ పోలీసులు
Gnanendra Prasad (Photo-Facebook)

Hyd, August 8: హైదరాబాద్ నగరంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు, శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకుడు జ్ఞానేంద్ర ప్ర‌సాద్ (BJP leader Gnanendra Prasad) సోమ‌వారం ఉద‌యం ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని మియాపూర్ ఆల్విన్ కాల‌నీలో జ్ఞానేంద్ర ప్ర‌సాద్ నివాస‌ముంటున్నాడు. ప్ర‌సాద్ త‌న‌ ఇంట్లోనే (Gnanendra Prasad Dies) ఉరేసుకున్నాడు.

ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు.. ఆయ‌న‌ను హుటాహుటిన చికిత్స నిమిత్తం స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే ప్ర‌సాద్ మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయ‌న కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. జ్ఞానేంద్ర ప్ర‌సాద్ మృతిప‌ట్ల ప‌లువురు బీజేపీ నాయ‌కులు సంతాపం ప్ర‌క‌టించి, కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతి తెలిపారు.

కత్తులు, బీరు బాటిళ్లతో వెంబడించి కానిస్టేబుల్ దారుణ హత్య, నంద్యాలలో నడిరోడ్డు మీద దారుణం, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

ఆయన ఆత్మహత్య (hanging in Miyapur) చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఆత్మహతకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.