 
                                                                 Hyd, Feb 24: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న బస్సును ఓ బైక్ వేగంగా ( Bus catches fire as bike hits it) ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో బైక్‌ను తప్పించే క్రమంలో బస్సు ఆటోపైకి దూసుకెళ్లింది. బస్సు ఇంజిన్ కిందిభాగంలో బైక్ ఇరుక్కొని మంటలు చెలరేగగా, బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మంటల్లో కాలిపోయి ప్రాణాలు వదిలాడు. అప్రమత్తమైన ప్రయాణికులు కిందకు దూకి ప్రాణాలు రక్షించుకొన్నారు.
ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని చెన్నారం గ్రామ శివారులో చోటుచేసుకొన్నది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు శ్రీశైలం నుంచి సంగారెడ్డికి వెళ్తున్నది. బస్సు చెన్నారం శివారులోకి చేరుకోగానే అచ్చంపేట వైపు వెళ్తున్న ఉప్పునుంతల మండలం వెల్టూర్‌కు చెందిన గంట సాయిబాబు (34) బైక్‌తో బస్సును ఢీకొట్టాడు. ప్రమాదంలో సాయిబాబు మంటల్లో చిక్కుకొని అక్కడకక్కడే మృతిచెందాడు. బైక్‌ను తప్పించబోయిన బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది.
బైక్ బస్సు కిందికి దూసుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు కిటికీ అద్దాలు పగులగొట్టి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ఉన్నారు. ఆటో డ్రైవర్ సైతం ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని అచ్చంపేట దవాఖానకు తరలించారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
