Chennai, Dec 14: తమిళనాడులో కుటుంబ సమేతంగా పర్యటిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న శ్రీరంగంలో రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. నేడు చెన్నై విచ్చేసిన కేసీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో కేసీఆర్ అర్ధాంగి శోభ, తనయుడు కేటీఆర్, ఇతర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలంటూ స్టాలిన్ ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.
మార్చి 22న సుదర్శన యాగంతో ప్రారంభమయ్యే వేడుకలు 28న అర్ధరాత్రి ముగియనున్నాయి. ఆ వారం రోజుల్లో ఏదో ఒకరోజు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవాలని స్టాలిన్‌ను కేసీఆర్ కోరినట్టు అధికారవర్గాలు తెలిపాయి.
Here's TRS Party Tweet
చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ స్టాలిన్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్. pic.twitter.com/JurF8pWa12
— TRS Party (@trspartyonline) December 14, 2021
అంతేకాదు ఈ భేటీలో థర్డ్ ఫ్రంట్ పైనా ఇరువురు చర్చించినట్టు సమాచారం. దేశ రాజకీయాలతోపాటు, రాష్ట్రాల పట్ల కేంద్ర వైఖరి, సమాఖ్య స్ఫూర్తికి గండి కొడుతున్న తీరుపై ఇద్దరు సీఎంలు చర్చించినట్లుగా తెలుస్తోంది.