Hyderabad, Sep 25: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ లో (CM KCR Delhi Tour) ఉన్న సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్.. మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో శనివారం భేటీ (Telangana CM KCR meets Gajendra Singh Shekhawat) అయ్యారు. వీరి భేటీ సుమారు 40 నిమిషాల పాటు సాగింది. కృష్ణా, గోదావరి జలాల అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, జాతీయ హోదా గుర్తింపుపై షెకావత్‌కు కేసీఆర్ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసిన వారిలో సీఎం కేసీఆర్‌తో పాటు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మహబూబ్‌నగర్ జిల్లాకు జరుగుతున్న నష్టం, కృష్ణా జలాల వివాదంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంతో పాటు, నీటి కేటాయింపులు జరపాలని కేంద్రమంత్రిని కోరినట్లు సమాచారం.
కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ గెజిట్ నోటిఫికేషన్ అమలు తేదీ వాయిదా అంశాన్ని మరోసారి షేకావత్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య సంయుక్తంగా ఉన్న ప్రాజెక్టులను మాత్రమే నోటిఫికేషన్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రమంత్రిని కేసీఆర్ కోరినట్లు సమాచారం. 26న (ఆదివారం) ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్వహించే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం అవుతారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగివస్తారు. సీఎం వెంట ఢిల్లీకి వెళ్లిన అధికారుల్లో సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.