
Hyd, Dec 29: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష (CM KCR Review Meeting) నిర్వహించారు. ఈ సమావేశంలో పోడు భూముల అంశంతో పాటు దళిత బంధు పథకం అమలు, మెడికల్ కాలేజీ నిర్మాణంపై సీఎం చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నల్లగొండ కలెక్టర్, అధికారులు హాజరయ్యారు.
ఈ సమీక్షా సమావేశం కంటే ముందు నల్లగొండ పీటీఆర్ కాలనీలో సీఎం కేసీఆర్ పర్యటించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ తండ్రి మారయ్య చిత్రపటానికి పూలమాల వేసి కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. అక్కడ్నుంచి నేరుగా నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు.