Hyd, July 30: రెండో విడత పంట రుణాల మాఫీ నిధులు మంగళవారం విడుదలయ్యాయి. మొదటి దఫాలో రూ.1 లక్ష లోపు రుణాలు మాఫీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈసారి రూ.లక్షన్నర లోపు ఉన్న రుణాలను మాఫీ చేసింది. ఈ నిధులను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.
రూ. లక్షా నుంచి రూ. లక్షా యాభై వేల లోపు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. రెండో విడతలో 6.4 లక్షల మంది రైతులకు రూ. 6,190 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. తొలి విడుతలో 11.34 లక్షల మంది రైతులకు రూ. 6,035 కోట్లు జమ చేశారు. రుణమాఫీ ద్వారా ఇప్పటి వరకు 17.75 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరినట్లు పేర్కొన్నారు. రెండు దశల్లో కలిపి రైతుల ఖాతాల్లో రూ. 12,225 కోట్లను జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. మళ్ళీ సొంత గూటికి గద్వాల ఎమ్మెల్యే, గులాబీ పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
ఈ సందర్భగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ తెలంగాణ రైతులందరి ఇళ్లల్లో పండుగరోజని, రైతు రుణమాఫీ చేయడంతో తమ జన్మ ధన్యమైందని అన్నారాయన.కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తున్నామని, రూ. లక్షన్నర వరకు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పామని.. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
రైతు ప్రయోజనాలే తమ ప్రభుత్వ విధానమని, రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకూడదని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన రూ. లక్ష రుణమాఫీ వడ్డీ కట్టేందుకే సరిపోయిందన్నారు. వాణిజ్య, వ్యవసాయ బ్యాంకుల నుంచి కూడా వివరాలు సేకరించామని సీఎం తెలిపారు. దేశ భద్రత, ఆహార భద్రతకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇచ్చిందని, రైతుల కష్టాలు గుర్తించే నెహ్రూ ఆనాడు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీరు నిరూపిస్తే ఇదే సభలో ముక్కు నేలకు రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, అసెంబ్లీలో విద్యుత్ పద్దులపై వాడి వేడి చర్చ
కార్పొరేట్ సంస్థల అధిపతులు బ్యాంకులను మోసం చేస్తున్నారన్న సీఎం.. గత పదేళ్లలో కార్పొరేట్ కంపెనీలు రూ.14 లక్షల కోట్లు ఎగవేశాయని చెప్పారు. కానీ, సాగుకోసం బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు తిరిగి కట్టలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ల రుణాలను మాఫీ చేస్తోందని చెప్పారు. రెండో విడత పంట రుణాల మాఫీ నిధుల విడుదల సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు.గతంలో అనేక మంది రైతులు సొంత పొలంలోనే పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయారు. ఏ రైతు కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకూడదనేదే మా విధానమన్నారు.
రైతు రుణమాఫీ వివరాలు
మొదటి విడతలో రూ. 11,34,412 రైతులకు రూ. 6034.96 కోట్లు
రెండవ విడతలో రూ. 6,40,223 మంది రైతులకు రూ. 6190.01 కోట్లు
మూడో విడతలో రూ. 17,75,235 మంది రైతులకు రూ.12,224.98 కోట్లు