Hyd, Nov 14: హైదరాబాద్ నగరంలో మరోసారి ర్యాగింగ్ భూతం (Telangana College Ragging) పడగ విప్పింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతనపల్లి గ్రామ శివారులోని IBS కాలేజీలో ఓ విద్యార్ధిని (10 Students Thrash Junior) చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు కేటీఆర్‌కు ఫిర్యాదు చేయడంతో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసులను ఆదేశించారు.
జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసి, అతనిపై దాడి చేసి, మతపరమైన నినాదాలు (Force Him To Chant Religious Slogans) చేయమని బలవంతం చేసినందుకు సైబరాబాద్ పోలీసులు 10 మంది కళాశాల విద్యార్థులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితులపై IPC సెక్షన్లు 307 (హత్య ప్రయత్నం), 342 (తప్పుగా నిర్బంధించడం), 450 (అతిక్రమం), 323 (బాధ కలిగించడం), 506 (నేరపూరిత బెదిరింపు) సెక్షన్లు 149 (సాధారణ వస్తువు) మరియు 4 (I) కింద బుక్ చేశారు. ,(II), మరియు (III) ర్యాగింగ్ నిషేధ చట్టం 2011 కింద కేసు నమోదు చేశారు. బాధితుడు బీబీఏ-ఎల్‌ఎల్‌బీ మొదటి సంవత్సరం విద్యార్థి, అతని బ్యాచ్‌కు చెందిన విద్యార్థిని మధ్య విభేదాలు ఈ ఘటనకు దారితీసినట్లు సమాచారం.
Here's Ragging Video
Seniors students of IBS College in #Chevella in Telangana ragging a junior student. @SabithaindraTRS @KTRoffice @KTR_News @TelanganaCMO @SomeshKumarIAS @arvindkumar_ias @TelanganaDGP @cyberabadpolice @CommissionerHR pic.twitter.com/fVluiX6HHj
— R V K Rao_TNIE (@RVKRao2) November 11, 2022
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఐబీఎస్ కాలేజీలో ర్యాగింగ్‌లో భాగంగా కొందరు సీనియర్లు హద్దుమీరారు. ఒక జూనియర్‌ని ఆట పట్టించాలనుకొని, అతనిపై దాడికి దిగారు. రూమ్‌లోకి తీసుకెళ్లి, ముఖంపై పౌడర్ చల్లి.. విచక్షణారహితంగా కొట్టారు. తమకు ఎదురు చెప్పాడని.. కోపంతో ఆ సీనియర్లు రెచ్చిపోయారు. వారి దెబ్బలకు తీవ్రంగా గాయపడిన విద్యార్థి.. వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి, జరిగిన విషయాన్ని వివరించారు.
దీంతో భయబ్రాంతులకు గురైన ఆ విద్యార్థి తల్లిదండ్రులు.. వెంటనే క్యాంపస్‌కు చేరుకొని, తమ పిల్లాడిని తీసుకెళ్లారు. దాడి చేసిన సీనియర్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇంత దారుణంగా ర్యాగింగ్‌కు పాల్పడుతుంటే.. కాలేజీ యాజమాన్యం ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు.. ఆ విద్యార్థిపై దాడి చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అది వైరల్ అయ్యింది. ఈ వీడియోపై నెటిజన్లు ట్విటర్‌లో మంత్రి కేటీఆర్, హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేసి.. ఆ సీనియర్లకు తగిన బుద్ధి చెప్పాలని ఫిర్యాదు చేశారు. ఈ విధంగా తనకు ఫిర్యాదు అందడంతో.. నిందితులపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు కేటీఆర్ సూచించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కాలేజీ యాజమాన్యం.. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థుల్ని సంవత్సరం పాటు సస్పెండ్ చేసింది. కాగా.. IBS కాలేజీలో ఎప్పట్నుంచో ర్యాగింగ్ జరుగుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
అక్టోబర్‌లో రాజేంద్రనగర్ అగ్రి వర్సిటీ హాస్టల్‌లో ర్యాగింగ్ జరిగింది. విచారణ జరిపిన వర్సిటీ 18 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఈనెల 1న వెటర్నరీ కళాశాల హాస్టల్‌లో జరిగిన ర్యాగింగ్‌పై విచారణ చేపట్టిన కమిటీ 34మంది విద్యార్థులపై చర్యలు తీసుకుంది. తాజాగా ఐబీఎ్‌స లో ఘటన ఉలికిపాటుకు గురిచేసింది.