TS Covid Update: తెలంగాణలో కొత్తగా 7,754 మందికి కరోనా, ఇంటివద్దకే మందులు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన హైదరాబాద్‌ సైక్లింగ్‌ గ్రూప్‌ సభ్యులు, తెలంగాణలో ఇకపై డ్రోన్ల ద్వారా కోవిడ్‌–19 వ్యాక్సిన్ల పంపిణీ
Coronavirus testing | File Image | (Photo Credits: PTI)

Hyderabad, May 1: తెలంగాణలో మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 7,754 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ (Telangana Corona Health Bulletin) అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 51 మంది (Covid Deaths) ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 6,542 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,43,360కి (Corona Cases) చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,62,160 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,312గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 78,888 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,507 మందికి క‌రోనా సోకింది.

కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో బయటకెళ్లలేని వృద్ధులు మందులు తెచ్చుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ఒంటరిగా ఉండడం, మరికొందరు బయటకెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇలాంటి వారికోసం సేవలందించేందుకు హైదరాబాద్‌ సైక్లింగ్‌ గ్రూప్‌ సభ్యులు ముందుకొచ్చారు. ‘రిలీఫ్‌ రైడర్స్‌’ పేరుతో సుమారు 40 మంది సైక్లిస్టులు నగరవ్యాప్తంగా వృద్ధులకు ఇంటివద్దే మందులు అందజేయనున్నట్లు హైదరాబాద్‌ సైక్లిస్ట్‌ మేయర్‌ సాంతన్‌, సైక్లిస్ట్‌ రవి తెలిపారు. ఈ సేవలు పొందాలనుకునేవారు 9629557866, 9566170334 నంబర్లకు ఫోన్‌ చేసి మందుల వివరాలు, ఇంటి చిరునామా స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.

తెలంగాణలో డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్, మందుల సరఫరా, ష‌ర‌తుల‌తో కూడిన అనుమతిని మంజూరు చేసిన, డిజిసిఎ, ఎంఒసిఎ, ఆరోగ్య సంరక్షణలో మెరుగైన ఫలితాలను సాధించడమే లక్ష్యంగా అనుమతులు మంజూరు

మానవ రహిత విమానాలు(డ్రోన్ల) ద్వారా కోవిడ్‌–19 వ్యాక్సిన్ల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వ్యాక్సిన్ల పంపిణీ కోసం డ్రోన్లు వినియోగించడానికి వీలుగా.. మానవ రహిత విమాన వ్యవస్థ(యూఏఎస్‌) నిబంధనలు–2021కు సడలింపులు ఇవ్వాలని మార్చి 9న రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి పట్ల తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ సానుకూలంగా స్పందించింది.

భారత్‌లో తొలిసారిగా ఒక్కరోజే 4 లక్షలు దాటిన కేసులు, 3,523 మంది మృతి, 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ వాయిదా, కరోనా వ్యాక్సిన్‌కు తీవ్ర కొరతను ఎదుర్కుంటున్న పలు రాష్ట్రాలు

కంటి చూపు మేర(విజువల్‌ లైన్‌ ఆఫ్‌ సైట్‌/వీఎల్‌ఓఎస్‌)లో ఎగిరే డ్రోన్ల ద్వారా ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ల పంపిణీకి షరతులతో కూడిన సడలింపులు ఇస్తూ ఆ శాఖ జాయింట్‌ సెక్రటరీ అంబర్‌ దూబె గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది కాలం లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ సడలింపులు అమల్లో ఉంటాయని తెలిపారు.

వ్యాక్సిన్ల పంపిణీకి డ్రోన్ల వినియోగంలో పాటించాల్సిన ప్రామాణిక పద్ధతి(స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసిజర్‌/ఎస్‌ఓపీ)ను సివిల్‌ ఏవియేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌(డీజీసీఏ) ఏప్రిల్‌ 26న ఆమోదించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కంటి చూపు పరిధి రేఖకు దాటి(బియాండ్‌ ది విజువల్‌ లైన్‌ ఆఫ్‌ సైట్‌/బీవీఎల్‌ఓఎస్‌) డ్రోన్లను ఎగురవేయడానికి సడలింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రయత్నాలు చేస్తోంది. మారుమూల గ్రామాలకు వ్యాక్సిన్లను చేర్చడానికి డ్రోన్లను వినియోగంలోకి తెస్తే సమయంతో పాటు రవాణా ఖర్చులు సైతం ఆదా కానున్నాయి.