High Court of Telangana | (Photo-ANI)

Hyderabad, July 8: తెలంగాణలో కరోనా రక్కసి శరవేగంగా వ్యాపిస్తోంది. తాజాగా హైకోర్టులో (Telangana High Court) కలకలం రేపింది. తెలంగాణ హైకోర్టులో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు, సెక్యూరిటీ సిబ్బందికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డం క‌ల‌క‌లం రేపుతోంది. మంగ‌ళ‌వారం న్యాయ‌స్థానంలో ప‌ని చేసే 50 మందికి సిబ్బందికి ప‌రీక్ష‌లు (coronavirus Tests) నిర్వ‌హించారు. నేడు దీని ఫ‌లితాలు వెలువ‌డ‌గా అందులో 10 మందికి పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు హైకోర్టు భ‌వ‌నాన్ని మూసివేసి శానిటైజేష‌న్ చేస్తున్నారు.  5 లక్షలు కట్టి శవాన్ని తీసుకెళ్లమన్న ప్రైవేట్ ఆస్పత్రి, అధిక బిల్లులు వసూలు చేయడంపై మండిపడిన తెలంగాణ హైకోర్టు, పలు ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు జారీ

హైకోర్టులోని ఈ-ఫైలింగ్ విభాగాన్ని జ్యుడీషియ‌ల్ అకాడ‌మీకి త‌ర‌లించారు. మ‌రోవైపు క‌రోనా ప్రబ‌‌లుతున్న వేళ ముందు జాగ్ర‌త్త‌లు చేప‌ట్టిన హైకోర్టు వీడియో కాన్ఫ‌రెన్స్‌ల ద్వారా ముఖ్య‌మైన కేసుల విచార‌ణ చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే మ‌రిన్ని కేసులు వెలుగుచూస్తున్న త‌రుణంలో ఇదే విధానాన్ని కొన‌సాగిస్తూ కేసుల విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు నిర్ణ‌యం తీసుకుంది.

కరోనాపై ప్రజలను చైతన్యం చేసిన కవిగాయకుడు నిస్సార్‌ కోవిడ్‌ బారినపడిన ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ప్రాణాలు విడిచారు. ‘కరోనా కరోనా నీతో యుద్ధం చేస్తాం మా భారత భూభాగాన. కరోనా కరోనా నిన్ను మట్టికరిపిస్తాం 130 కోట్ల జనం సరేనా!!’అంటూ కరోనాపై కలం గురిపెట్టిన నిస్సార్‌ అకాల మరణంపై పలువురు సాహితీవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో మంగళవారం ఒక్కరోజే 1422 కోవిడ్‌పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.మొత్తం ఏడుగురు మృత్యువాతపడ్డారు.రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్‌ జిల్లాలో94 కరోనా కేసులు నమోదయ్యాయి.