Telangana COVID-19: తెలంగాణలో 75వేలు దాటిన కోవిడ్ కేసులు, 24 గంటల్లో 2,207 కొత్త కేసులు నమోదు, గత 24 గంటల్లో కరోనాతో 12 మంది మృతి
Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

Hyderabad, August 6: తెలంగాణలో తాజాగా 2,207 కరోనావైరస్ కేసులు (Telangana COVID-19) నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 75,257కు చేరింది. కోవిడ్ (Coronavirus) నుంచి కొత్తగా 1136 మంది పూర్తిగా కోలుకోగా .. డిశ్చార్జి అయినవారి సంఖ్య 53,239గా ఉంది. గత 24 గంటల్లో కరోనాతో 12 మంది మృతి (Covid 19 Deaths) చెందడంతో.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 601కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,417 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కాగా కేసుల విషయానికి వస్తే.. జీహెచ్ఎంసీలో 532, రంగారెడ్డి జిల్లాలో 196 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 70.7శాతంగా ఉంది. అలాగే 14,837 మంది హోం ఐసోలేషన్‌ ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా 23,495 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,66,984 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Here's TS Covid Report

జిల్లాల వారీగా చూస్తే.. జీహెచ్ఎంసీ 532, రంగారెడ్డి 196, వరంగల్ అర్బన్ 142, మేడ్చల్ 136 కేసులు, కరీంనగర్ 93, కామారెడ్డి 96, నిజామాబాద్‌ 89, భద్రాద్రి కొత్తగూడెం 82, జనగాం 60, జోగులాంబ గద్వాల 87, కామారెడ్డి 96, కరీంనగర్‌ 93, ఖమ్మం 85, నిజామాబాద్‌ 89, పెద్దపల్లి 71 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో 24 గంటల్లో 62,538 కరోనా కేసులు, కరోనావైరస్‌తో పాట్నా కోర్టు జడ్జి మృతి, 20 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు, 41,585కు పెరిగిన క‌రోనా మృతుల సంఖ్య

ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి తెలంగాణలో మొత్తం కరోనా కేసులు కనిష్ఠంగా 2,84,710 కేసులు, గరిష్ఠంగా 9,66,971 కేసులు నమోదు కావొచ్చని ఫిక్కీ తెలంగాణ, ఆస్కీ, (అడ్మినిస్ట్రేషన్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా), ఎఫ్‌టీసీసీఐ (ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. చైనాలో మరో ప్రమాదకర వైరస్, ఎస్ఎఫ్‌టీఎస్ దెబ్బకు ఏడు మంది మృతి, 60 మంది ఆస్పత్రిలో చేరిక, మ‌నుషుల ద్వారా వ్యాప్తి చెందుతుంద‌ని హెచ్చ‌రిక‌లు జారీ

2020, జులై 24 వరకూ ఉన్న వాస్తవ డేటా ఆధారంగా ఈ అంచనా వేసింది. దీని ప్రకారం.. జూన్‌ 21 నాటికి 546గా ఉన్న రోజువారీ కేసుల సంఖ్య.. సెప్టెంబరు 30 నాటికి కనిష్ఠంగా 4,753, గరిష్ఠంగా 37,393గా నమోదు కావచ్చని పేర్కొంది. ఇక మరణాల విషయనికి వస్తే.. జూన్‌ 21 నాటికి 5గా ఉన్న రోజువారీ మరణాల సంఖ్య.. సెప్టెంబరు 30 నాటికి కనిష్ఠంగా 18, గరిష్ఠంగా 83గా నమోదు కావచ్చని అంచనా వేసింది.