MP Raghu Rama Krishna Raju: A1 గా ఎంపీ రఘురామ, A2గా ఆయన కుమారుడు భరత్, ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌ బాషా కిడ్నాప్‌.. దాడి, క్రిమినల్‌ కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు
Criminal case against MP Raghu Ramakrishna Raju, son (Photo-Video Grab)

Hyd, July 5: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భద్రత విధుల్లో ఉన్న ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌ బాషాను కిడ్నాప్‌ చేసి, తీవ్రంగా హింసించిన కేసులో నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు (MP Raghu Rama Krishna Raju), ఆయన కుమారుడు భరత్‌పై తెలంగాణ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు (Criminal case against MP Raghu Ramakrishna Raju)చేశారు. ఇందులో ప్రధాన నిందితుడిగా (ఎ1గా) ఎంపీ రఘురామకృష్ణరాజు, ఏ 2గా ఆయన కుమారుడు భరత్, ఏ 3 గా సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఎన్‌.సందీప్‌ సాధు, ఏ 4 గా సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్సై కె. గంగారామ్, ఏ 5గా ఎంపీ పీఏ శాస్త్రి, మరికొందరిపై హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీసులు మంగళవారం ఎఫ్‌ఐఆర్‌ (FIR) నమోదు చేశారు.

ఐపీసీ 365, 332, 384, 323, 324, 342, 504, 506, 294(బి) రెడ్‌ విత్‌ 34, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ షేక్‌ ఫరూక్‌ బాషా విధులకు ఆటంకం కలిగించడం, కిడ్నాప్‌ చేసి నిర్బంధించడం, దాడి చేసి బెదిరించడం వంటి ఆరోపణలపై ఈ కేసు నమోదు చేశారు. ఇందులో రఘురామ వద్ద భద్రత విధులు నిర్వర్తిస్తున్న నలుగురు సీఆర్పీఎఫ్‌ సిబ్బందినీ నిందితులుగా చేర్చారు.

కేసు ఏంటీ ?

ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా ఆందోళనలు చేసేందుకు కొన్ని పార్టీలు, సంఘాలు నిర్ణయించాయని ఏపీ ఇంటెలిజెన్స్‌ వర్గాలకు సమాచారం అందింది. ఏపీ నుంచి కూడా కొందరు హైదరాబాద్‌ వెళ్లినట్టు గుర్తించారు. దాంతో భద్రత ఏర్పాట్లలో భాగంగా ఇంటెలిజెన్స్‌ అధికారులు తమ సిబ్బందిని హైదరాబాద్‌ పంపించారు. అందులో భాగంగా సోమవారం ఐఎస్‌బీ గేటు వద్ద స్పాటర్‌గా నియమించారు. విధి నిర్వహణలో ఉన్న ఫరూక్‌ బాషాపై ఎంపీ రఘురామ కుటుంబసభ్యులు, ఆయన భద్రతకు నియమితులైన సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది కొందరు దాడిచేశారు. నడిరోడ్డుపైనే దాడి చేయడం, సెల్‌ఫోన్, పర్సు, ఐడీ కార్డు లాక్కోవడం, కారులో కిడ్నాప్‌ చేయడం తదితరాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ సమయంలో అక్కడున్నవారు కూడా ఈ దృశ్యాల ను సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. ఫరూక్‌ తమపై నిఘాకు వచ్చినట్లుగా ఎంపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు.

మళ్లీ బాదుడు షురూ, రూ.50 పెరిగిన డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండ్‌ ధర, పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి..

అయితే అది అవాస్తవమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఫరూక్‌ విధులు నిర్వర్తిస్తున్న ఐఎస్‌బీ గేట్‌ ప్రాంతానికి, ఎంపీ రఘురామ ఇంటికి సంబం ధం లేదు. రఘురామ ఇల్లు అక్కడికి 1.3 కిలోమీటర్ల దూరంలోని బౌల్డర్‌ హిల్స్‌లో ఉంది. ఫరూక్‌ను నడిరోడ్డుపై కొట్టుకుంటూ బౌల్డర్‌ హిల్స్‌లోని ఎంపీ విల్లా ఎ–74కు తీసుకువెళ్లారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఎంపీ ఇంట్లో చిత్ర హింసలకు గురిచేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడు భరత్‌ కూడా ఫరూక్‌పై దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ముందుగా భరత్, శాస్త్రి, సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్సై కె.గంగారామ్, కానిస్టేబుల్‌ సందీప్‌తోపాటు మరికొందరు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బం ది ఫరూక్‌పై దాడిచేశారు. సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్సై, కానిస్టేబుల్‌ సందీప్‌ ఆయన కాళ్లు, చేతులపై లాఠీలతో కొట్టారు. భరత్, శాస్త్రి కానిస్టేబుల్‌ ఫరూక్‌ మెడ, కడుపుపై పిడిగుద్దులు కురిపించారు. ఫరూక్‌ బాషాపై రఘురామ రాజు కూడా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

విధి నిర్వహణలో ఉన్న ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌పై దాడిని సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. దాడిలో పాల్గొన్న సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్సై కె.గంగారామ్, కానిస్టేబుల్‌ ఎన్‌.సందీప్‌ సాధును సస్పెండ్‌ చేస్తూ సీఆర్‌పీఎఫ్‌ కమాండెంట్‌ మహేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మరో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లపై కూడా ఉన్నతాధికారులు విచారి స్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇంకా ఎందరు నిందితులున్నారో తెలియాల్సి ఉంద ని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ తెలిపారు.