Coronavirus Cases in India (Photo Credits: PTI)

Hyderabad, August 6: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 2,092 కరోనా పాజిటివ్‌ కేసులు (Telangana Coronavirus Update) నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 586 ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య (Coronavirus Outbreak) 73,050కి చేరాయి. వైరస్‌ ప్రభావంతో 13 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 589కి చేరింది. ప్రస్తుతం 20,358 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా, 52,103 మంది వైరస్‌ నుంచి కోలుకు డిశ్చారి అయ్యారు. అలాగే 13,793 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా 21,346 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 5,43,489 పరీక్షలు చేయగా, నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది.

జీహెచ్ఎంసీ పరిధిలో 535, మేడ్చెల్-126, రంగారెడీ-169, వరంగల్ అర్బన్-128, సంగారెడ్డి-100, నిజామాబాద్-91 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 73,050 కాగా ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 20,358 ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. 20 లక్షలకు చేరువలో కరోనా కేసులు, 40 వేలు దాటిన మరణాలు, గత 24 గంటల్లో 56,282 కోవిడ్-19 కేసులు నమోదు

ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలపై తెలంగాణ హైకోర్టు (TS Highcourt) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడింది. అపోలో, బసవతారకం ఆస్పత్రులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయని దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు బుధవారం విచారించింది. కొందరు పేదలకు ఉచితంగా వైద్యం అందించాలన్న షరతులతో ప్రభుత్వం రాయితీ ధరలకే పలు ఆస్పత్రులకు భూమి కేటాయించిందని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. రాయితీ ధరలకే భూమి పొందిన అపోలో, బసవ తారకం ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం ఇవ్వడం లేదని ఆరోపించాడు. దీంతో షరతులు ఉల్లంఘిస్తే భూములు ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కొత్త సెక్రటేరియట్ డిజైన్‌కు తెలంగాణ కేబినెట్ ఆమోదముద్ర, ఏడాదిలోపే పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచన, కరోనా కట్టడిపై కొనసాగుతున్న కేబినెట్

అధిక బిల్లులు చెల్లించక పోతే మృతదేహాలను కూడా అప్పగించడం లేదని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. లైసెన్సులు రద్దు చేస్తే సరిపోదని, భూములు వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. అపోలో, బసవ తారకం ఆస్పత్రులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విశ్రాంత ఉద్యోగి ఓ.ఎం. దేవర ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

పేద రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తామనే షరతుతో ప్రభుత్వం నుంచి రాయితీ పద్ధతిలో భూమిని లీజుకు తీసుకుని.. షరతులను ఉల్లంఘించిన ప్రైవేటు ఆసుపత్రుల భూమి లీజును రద్దు చేయొచ్చని హైకోర్టు సూచించింది. ఆ భూమిని స్వాధీనం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అపోలో, బసవతారకం కేన్సర్‌ ఆసుపత్రులు ప్రభుత్వం నుంచి రాయితీ పద్ధతిలో భూమిని లీజుకు తీసుకుని పేదలకు ఉచితంగా వైద్యం చే యాలన్న నిబంధనను ఉల్లం ఘించాయంటూ రిటైర్డ్‌ ఉద్యోగి ఓఎం దేబరా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం విచారించింది.