Telangana New Secretariat (Photo-TS CMO)

Hyderabad,August 5: ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కొత్త సచివాలయం నిర్మాణం (New Secretariat Design), నియంత్రిత సాగు, కరోనా కట్టడి చర్యలు, కొవిడ్‌ (Covid) నేపథ్యంలో విద్యారంగానికి సంబంధించిన అంశాలు, కృష్ణా జలాల అంశం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలక్ట్రిక్‌ వాహనాల పాలసీ, రిటైల్‌ ట్రేడ్‌, లాజిస్టిక్‌ పాలసీపై చర్చిస్తున్నారు. సమావేశానికి మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. 132 ఏళ్ల చరిత్ర గల భవనం కూల్చివేత, కొత్త సచివాలయ భవన నమూనాను విడుదల చేసిన తెలంగాణ సీఎంఓ

కొత్త సెక్రటేరియట్ డిజైన్‌కు (Telangana secretariat Design) కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు విద్యారంగంపై చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏ విధంగా ఉంది.. కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

తెలంగాణ పాత సచివాలయ భవనం కూల్చివేత పనులు దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో... కొత్త సచివాలయం డిజైన్‌ పై గత వారం తెలంగాణ సీఎం సమావేశం నిర్వహించిన సంగతి విదితమే. కొత్త సచివాలయ నమూనాలో మరికొన్ని మార్పులు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. గతంలోనే ఓ సారి సచివాలయ నమూనాలో మార్పులు సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి... తాజాగా ఈ డిజైన్‌కు సంబంధించి మరిన్ని మార్పులు సూచించారు. మంత్రులు, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్‌లు కూడా అన్ని సౌకర్యాలతో ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్ అన్నారు. మసీదు దెబ్బతినడంపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

ప్రతి అంతస్తులోనూ డైనింగ్‌ హాల్‌, మీటింగ్‌ హాల్‌, సందర్శకుల కోసం వెయిటింగ్‌ హాల్‌, అన్ని వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం ఉండే లా నిర్మాణం జరగాలని ఆయన తెలిపారు. ఆర్కిటెక్ట్‌లు సిద్ధం చేసిన నమూనాలో మరికొన్ని మార్పులు సూచించారు. సచివాలయం నమూనా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా ఆర్కిటెక్ట్‌లు.. ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులతో చర్చించి రూపొందించిన నమూనాను సీఎంకు నివేదించారు. తెలంగాణ కొత్త సచివాలయం డిజైన్ ఖరారైన నేపథ్యంలో సాధ్యమైనంత తొందరగా టెండర్లు పిలిచి నిర్మాణం మొదలుపెట్టాలనే యోచనలో సర్కార్ ఉంది. కొత్త సచివాలయ భవన నిర్మాణాన్ని ఏడాదిలోపే పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.