Telangana: ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్, సెప్టెంబ‌ర్ 2వ తేదీ ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యానికి భూమి పూజ చేయనున్న తెలంగాణ ముఖ్యమంత్రి, దళితబంధు పథకం మరో 4 మండలాలకు వర్తింపు
TS CM KCR | Photo: IPR Telangana

Hyderabad, Sep 1: బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఢిల్లీకి (KCR went to Delhi) బ‌య‌ల్దేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట ప‌లువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో ప‌ర్య‌టించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 2వ తేదీన మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యానికి కేసీఆర్ భూమి పూజ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఢిల్లీకి చేరుకున్న మంత్రులు వేముల ప్ర‌శాంత్ రెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌య నిర్మాణ స్థ‌లాన్ని ప‌రిశీలించారు.

భూమి పూజ‌ కార్య‌క్ర‌మంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు, పార్టీ నాయ‌కులు పాల్గొన‌నున్నారు. సెప్టెంబ‌ర్ 3న మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌కు సీఎం కేసీఆర్ తిరిగి బ‌య‌ల్దేర‌నున్నారు. ఢిల్లీలోని వ‌సంత్ విహారం మెట్రో స్టేష‌న్ ప‌క్క‌న టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌య నిర్మాణం కోసం 1300 గ‌జాల స్థ‌లాన్ని కేంద్ర ప్ర‌భుత్వం కేటాయించిన సంగ‌తి తెలిసిందే.

తెలంగాణలో 18 నెలల తర్వాత ప్రారంభమైన పాఠశాలలు, పిల్లలకు వ్యాక్సిన్ వచ్చేవరకు జాగ్రత్తగా ఉండాలని కోరిన గవర్నర్ తమిళిసై, విద్యార్థులను తమ సొంత బిడ్డలా చూసుకుంటామని భరోసా ఇచ్చిన మంత్రి సబిత

తెలంగాణలో దళితబంధు పథకాన్ని (Telangana Dalit Bandhu Scheme) ఒక ఉద్యమంలా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇక రాష్ట్రంలోని నలుదిశలా దళితబంధు పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ సందర్భంగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని దళిత ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను (extended in another 4 mandals) ఎంపిక చేశారు. ఆ నాలుగు మండలాల్లో అన్ని దళిత కుటుంబాలకు హుజూరాబాద్‌తో పాటు అమలుచేయాలని సీఎం ఆదేశించారు.

రూ. 8 లక్షల లోపు ఆదాయం ఉంటే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం, ఎవరెవరు అర్హులనే దానిపై గైడ్‌లైన్స్ ఇవే

నాలుగు మండలాలు ఇవే

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం: చింతకాని మండలం

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం: తిరుమలగిరి మండలం

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం: చారగొండ మండలం

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం: నిజాం సాగర్ మండలం

ఈ మండలాల్లోని అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేయనుంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో హైదరాబాద్‌లో సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయనున్నారు.