BRS Logo

Assembly Election 2023 Results Live News Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఇక, ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన కొందరు కీలక నేతలు భారీ వెనుకంజలో ఉ‍న్నారు. పాలకుర్తిలో కాంగ్రెస్‌ అభ్య‍ర్థి యశస్విని నాలుగు వేల మెజార్టీతో ముందుకు సాగుతున్నారు. కాగా, ముందు నుంచి పాలకుర్తిపై ఫోకస్‌ పెట్టిన కాంగ్రెస్‌.. ఎర్రబెల్లిని ఓడించడమే టార్గెట్‌గా పెట్టుకుంది. మరోవైపు.. ఖమ్మంలో పువ్వాడను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కాంగ్రెస్‌ నేతలు తుమ్మల, పొంగులేటి చాలా సందర్బాల్లో చెప్పిన విషయం తెలిసిందే.

తెలంగాణలో బోణీ కొట్టిన కాంగ్రెస్‌, అశ్వారావుపేట, ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం, కొనసాగుతున్న కౌంటింగ్

తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. తాజాగా ఇప్పటివరకు వెలువడిన తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లును కైవసం చేసుకుంది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఇల్లెందు (ఎస్టీ) నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య తన సమీప ప్రత్యర్థి బానోతు హరిప్రియ నాయక్ పై గెలుపొందారు. అలాగే ఖమ్మం ఆశ్వారావుపేటలో కాంగ్రెస్‌ విజయం నమోదు చేసింది. 28,358 ఓట్లతో ఆది నారాయణ గెలుపు బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై గెలుపొందారు.

వెనుకంజలో ఉన్న మంత్రులు వీరే..

బాల్కొండ.. ప్రశాంత్‌ రెడ్డి

పాలకుర్తి.. ఎర్రబెల్లి దయాకర్‌ రావు

ఖమ్మం.. పువ్వాడ అజయ్‌కుమార్‌

నిర్మల్‌.. ఇంద్రకరణ్‌ రెడ్డి

ధర్మపురి.. కొప్పుల ఈశ్వర్‌

కరీంనగర్‌.. గంగుల కమలాకర్‌

మహబూబ్‌నగర్‌.. శ్రీనివాస్‌ గౌడ్‌(స్వల్ప ఆధిక్యం, 60 ఓట్లు)

సిద్దిపేటలో కారు జోరు కొనసాగుతోంది. ఆరో రౌండ్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హరీశ్‌రావుకు 5,758 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 1,497 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,515 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా ఆరు రౌండ్లలో కలిపి హరీశ్‌ రావు 28,495 ఓట్లతో ముందంజలో ఉన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి జగదీష్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 7వ రౌండ్‌ కౌంటింగ్ ముగిసే సరికి జగదీష్‌రెడ్డి 4,573 ఓట్ల ముందంజలో ఉన్నారు. 7వ రౌండ్‌లో బీఆర్‌ఎస్‌కు 2,288, కాంగ్రెస్‌ 2,081, బీజేపీ 2,942 ఓట్లు ఓట్లు వచ్చాయి.

తెలంగాణలో గెలుపు దిశగా కాంగ్రెస్.. ఎమ్మెల్యేల తరలింపు కోసం తాజ్ కృష్ణలో సిద్ధంగా ట్రావెల్స్ బస్సులు.. వీడియోతో

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 10వ రౌండ్‌ ముగిసే సరికి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి 6,395 ఓట్లతో ముందంజలో ఉన్నారు. మొత్తం పది రౌండ్లలో కలిపి సబితా ఇంద్రారెడ్డికి 54,610 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 48,215 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి 29,971కి ఓట్లు పోలయ్యాయి. కొల్లాపూర్ లో బర్రెలక్కకు 1200 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం కౌంటింగ్‌ కొనసాగుతోంది.

హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలున్న హైదరాబాద్ లో ఇప్పటి వరకు 5 నుంచి 8 స్థానాలో పూర్తి ఆధిపత్యం దిశగా కొనసాగుతోంది. దీంతో పాటు రంగారెడ్డిలోనూ కారు దూసుకెళ్తోంది. 14 స్థానాలున్న రంగారెడ్డిలో మెజారిటీ దిశగా దాదాపు 10 స్థానాల్లో ముందంజలో ఉంది.

ఏడో రౌండ్ లో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సుమారు 13,000 లీడ్

ఖానాపూర్‌లో ఆరువేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి వెడ్మ బొజ్జు

హుజూరాబాద్‌లో ఆరో రౌండ్‌ ముగిసేసరికి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి లీడ్‌

మానుకొండూరులో సత్యనారాయణ(కాంగ్రెస్‌) 15 వేల ఆధిక్యం

పెద్దపల్లిలో 17వేల లీడ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయరమణారావు