Telangana: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు, రెండు జిల్లాల్లో ఆటో-లారీ, బస్సు - కారు ఢీ, వికారాబాద్ జిల్లాలో నలుగురు, సంగారెడ్డి జిల్లాలో నలుగురు మృతి
Accident (Credits: Google)

Vikarabad, Nov 3: తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ధరూర్ మండలం కేరెల్లి బాచారం వంతెన వద్ద ఆటోను ఓ లారీ ఢీకొట్టింది. సంఘటనా స్థలంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను వికారాబాద్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి ప్రాణాలు కోల్పోయాడు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

మృతుల్లో ఆటో డ్రైవర్‌ జమీల్‌, రవి, కిషన్‌, సోనీబాయిగా గుర్తించారు. బాధితులంతా పెద్దేముల్‌ మండలం మదనంతాపూర్‌ వాసులుగా పోలీసులు తెలిపారు. కూలీ పనుల కోసం వికారాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబాల రోధనలు మిన్నంటాయి. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురంలో ఘోర విషాదం, విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు కార్మికులు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

ఇక సంగారెడ్డి జిల్లాలోని అందొలు మండలం కన్సాన్‌పల్లి వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురు మృత్యువాతపడ్డారు. నాందేడ్ - అకొలా జాతీయ రహదారి ఆర్టీసి బస్సు, కారు పరస్పరం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

బస్సు రాంగ్ రూట్‌లో రావడం... పొగ మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనం కనిపించక పోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన... దిలీప్, వినోద, సప్రతిక, మరో చిన్నారిగా గుర్తించారు. శుబాష్ నగర్ ఐ.డి.ఎ జీడిమెట్లకు చెందిన వారుగా తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.