Hyd, Nov 26: కరీంనగర్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు మానకొండూరు పోలీస్ స్టేషన్ ప్రాంతంలో అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో (Road Accident in Karimnagar) నలుగురు మృత్యువాత పడ్డారు. ఒకరికి తీవ్ర గాయలవ్వగా ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా కల్లూరులో దశ దినకర్మకు వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
మృతులు కరీంనగర్‌లోని జ్యోతినగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న కొప్పుల శ్రీనివాస రావు, కొప్పుల బాలాజీ శ్రీధర్, ఇందూరి జలంధర్, శ్రీరాజు మృతి (Four people died) చెందగా.. మరో వ్యక్తి పెంచాల సుధాకర్ రావుకు తీవ్రగాయాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే నిద్రమత్తులో కారు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు
ఇక హైదరాబాద్ నగరానికి చెందిన నవదంపతులు పెళ్లి అయిన మరునాడే రోడ్డు ప్రమాదానికి గురై విగతజీవులుగా మారారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నేతాజీనగర్‌లో నివసించే పార్శి మురళీకృష్ణ, అన్నపూర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీనివాసులు(38) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అతనికి చెన్నైకి చెందిన కనిమొళి(33)తో తిరుపతిలో ఆదివారం వివాహమైంది. సోమవారంరాత్రి 8.30 గంటల సమయంలో బెంగళూరు నుంచి ఐ 10 వాహనంలో నవదంపతులతోపాటు ఇద్దరు బంధువులు చెన్నైకి ప్రయాణమయ్యారు.
బెంగళూరు నుంచి 120 కి.మీ. దూరంలో రాత్రి 12 గంటల సమయంలో కారును నడుపుతున్న శ్రీనివాసులు ఆగివున్న లారీని ఢీకొట్టడంతోఅతను అక్కడికక్కడే మృతి చెందాడు. కోమాలోకి వెళ్లిన కనిమొళి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. వారితో ప్రయాణిస్తున్న నవవధువు సోదరి, శ్రీనివాసులు కోడలు తీవ్ర గాయాలపాలయ్యా రు. శ్రీనివాసులు మృతదేహాన్ని బుధవారం ఉద యం నేతాజీనగర్‌కు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.