
Hyd, Sep 22: నేషనల్ హెరాల్డ్ కేసులో నలుగురు టీకాంగ్రెస్ నేతలకు (Four senior Congress leaders) ఈడీ నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో (ED notices in National Herald case) భాగంగా షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డికి నోటీసులు అందినట్టు సమాచారం. ఈ నోటీసులు కాంగ్రెస్ నేతలను అక్టోబర్ 10న విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈడీ నోటీసులు జారీ చేసినవారిలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ,సుదర్శన్ రెడ్డి, గీతారెడ్డి,అంజన్ కుమార్ లు ఉన్నారు. తమకు ఈడీ నోటీసులు అందినమాట నిజమేనని షబ్బీర్ అలీ స్పష్టంచేశారు.
మనీలాండరింగ్ యాక్ట్ 50 కింద నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. అక్టోబర్ 10న ఢిల్లీకి విచారణకు రావాలని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి గీతారెడ్డి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీళ్లంతా నేషనల్ హెరాల్డ్ కు నిధులు సమకూర్చారని ఈడీకి గుర్తించిందని తెలుస్తోంది.
ఈ రోజు కేరళ బంద్, PFI కార్యకర్తల అరెస్ట్‌కు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా
కాగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అలాగే మల్లిఖార్జున ఖర్గే, పవన్ బన్సల్ లను కూడా ఈడీ విచారించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో తనకు ఈడీ నోటీసులు వచ్చాయన్న వార్తలపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పందించారు. తనకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. అయితే పత్రిక నడపడానికి కొంత ఫండ్ మాత్రం తాను ఇచ్చానని షబ్బీర్ అలీ అంగీకరించారు. ఈడీ నోటీసులు వస్తే విచారణకు హాజరవుతానని తెలిపారు. యంగ్ ఇండియన్ లిబిటెడ్ కంపెనీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆర్థిక లావాదేవీలను ఈడీ అధికారులు గుర్తించారు.