Telangana: నేను రబ్బర్ స్టాంప్ గవర్నర్ కాదు, కేసీఆర్‌తో కలిసి పని చేయడం చాలా కష్టం, తెలంగాణ ముఖ్యమంత్రిపై గవర్నర్ త‌మిళిసై సంచలన వ్యాఖ్యలు, విభేదాలు ఉన్నా, చర్చలతో పరిష్కరించుకుందామని పిలుపు
CM KCR And Guv Soundararajan (Photo-File Image)

Hyd, April 19: తెలంగాణ ప్ర‌భుత్వంపైనా.. ప్రత్యేకించి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై (Telangana Guv Soundararajan) మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తానేమీ ర‌బ్బ‌ర్ స్టాంప్ గ‌వ‌ర్న‌ర్‌ను కాదంటూ ఆమె చేసిన వ్యాఖ్య‌లు తాజాగా క‌ల‌క‌ల‌మే రేపుతున్నాయి. చెన్నైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇద్దరు వేర్వేరు ముఖ్యమంత్రులతో పని చేస్తున్నానని తెలిపారు. రెండూ రాష్ట్రాల్లో విధులు చాలా భిన్నమైనవని అ‍న్నారు.

ఇప్పుడు తాను వారితో కలిసి పని చేశానని ఇక ఇతర ముఖ్యమంత్రులతో కూడా పని చేయగలనని తనకు తెలుసన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కొందరు సీఎంలు (తెలంగాణ సీఎంను ఉద్దేశించి) నియంతృత్వంగా (CMs Trying To Become Dictatorial) మారేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇది మంచిది కాదని గవర్నర్ తమిళిసై హితవు పలికారు. సీఎం కేసీఆర్‌తో క‌లిసి ప‌నిచేయడం నాకు పెద్ద స‌వాల్‌ (challenging To Work With KCR;). సీఎం చెప్పార‌ని ఫైల్‌పై సంత‌కం చేయ‌డానికి నేను ర‌బ్బ‌ర్ స్టాంప్ గ‌వ‌ర్న‌ర్‌ను కాను.

టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు వ్యాఖ్యలపై స్పందించిన గవర్నర్ తమిళిసై, పాత వీడియోలతో సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారని.. తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని ఆవేదన

రాజ‌కీయంలో ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శ‌లు చేస్తారు. ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న‌ప్పుడు నాపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. న‌న్ను వేరే రాష్ట్రానికి మారుస్తార‌నేది వాస్తవం కాదు. ఢిల్లీ వెళ్లిన వెంట‌నే నాపై అస‌త్య ప్ర‌చారం చేశారు. సీఎం, గ‌వ‌ర్న‌ర్ క‌లిసి ప‌నిచేయ‌క‌పోతే ఎలా ఉంటుందో తెలంగాణ‌ను చూస్తే తెలుస్తుంది" అన్నారు. ఎవరు గవర్నర్‌గా ఉన్నా.. ప్రోటో​కాల్‌ పాటించాల్సిందేనని తెలిపారు. రాజ్‌భవన్‌ ఆహ్వానాలను రాజకీయంగా చూడకూడదని అన్నారు. ఏ విభేదాలు ఉన్నా, చర్చలతో పరిష్కరించుకుందామని గవర్నర్‌ తమిళిసై తెలిపారు.

'నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యమంత్రి, గవర్నర్‌ మధ్య సత్సంబంధాలు ఉండాలి. అనేక విషయాల్లో అభిప్రాయభేదాలు ఉండొచ్చు. రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎన్నో సిఫార్సులు చేస్తారు. వాటిలో అన్నింటినీ నేను ఆమోదించలేను. ఇది పూర్తిగా రాజ్యాంగపరమైన అంశం. రాజ్యాంగపరమైన హక్కులను ఉపయోగించి ఏదైనా విషయంలో గవర్నర్‌ నిర్ణయాలు తీసుకుంటే.. అది నా విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయమే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకున్నట్లు భావించొద్దు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులను గవర్నర్‌ ఆమోదించకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు.

చేతికి ఎముక లేదనడానికి ట్రేడ్‌మార్క్‌ సీఎం కేసీఆర్, న్యాయాధికారుల సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించిన సీజేఐ ఎన్వీ రమణ

తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు గవర్నర్‌ విందును బహిష్కరించాయి. గవర్నర్‌ను ఒక పార్టీకి చెందిన వారిగా చూడటం సరికాదు. ప్రతి ఒక్కరికి భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఒకరు తమ అభిప్రాయం చెప్పగానే విమర్శించడం సరికాదు. అంతే కాకుండా కొన్ని ప్రొటోకాల్స్‌ని ఉల్లంఘిస్తున్నారు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. విషయమేదైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్‌ నిర్ణయం తీసుకుంటే వివాదం చేయాల్సిన అవసరం లేదు.

అలాంటి ఆలోచనా ధోరణి సరైంది కాదు. ఏం జరిగినా సరే వ్యవస్థలోని ఎస్‌వోపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) పాటించడం తప్పనిసరి. సందర్భం, విషయం ఏదైనా సరే ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు రాజ్యాంగపరమైన నిబంధనలు పాటించాలి. అలా చేయడం ద్వారా రాజ్యాంగానికి గౌరవం ఇచ్చిన వాళ్లమవుతాం. పరస్పర గౌరవం, అవగాహనతో సమస్యలు పరిష్కారమవుతాయి'' అని తమిళిసై పేర్కొన్నారు.