Telangana: టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు వ్యాఖ్యలపై స్పందించిన గవర్నర్ తమిళిసై, పాత వీడియోలతో సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారని.. తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని ఆవేదన
Governor Tamil Sai (Photo-Video Grab)

Hyd, April 18: తనపై తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు చేస్తున్న విమర్శలపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ మరోసారి స్పందించారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని తాను ఏనాడూ అనలేదని, రాజకీయం చేస్తున్నారని అనవసరంగా తనను విమర్శిస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీ కరించారని గవర్నర్ తమిళిసై అన్నారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న తమిళిసై.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా భేటీ తరుణంలో సోమవారం మరోసారి ఈ విషయమై స్పందించారు. ‘తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా నన్ను విమర్శించారు. పాత వీడియోలతో సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారు. ప్రజలను కలిస్తే తప్పుగా (unnecessarily criticizing politics) అర్థం చేసుకుంటున్నారు. ఏ పదవిలో ఉన్నా.. ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం’ అని తమిళిసై పేర్కొన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వంతో (TRS Govt) నడుస్తున్న ప్రోటోకాల్‌ వివాదంపైనా ఆమె స్పందించారు. ప్రోటోకాల్‌ ఉల్లంఘనపై కేంద్రం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు.. రాజకీయం చేయాల్సిన అవసరం తనకు లేదని, అలాంటి ఆలోచన కూడా లేదని ఆమె (Governor Tamil Sai) స్పష్టం చేశారు.

యాదాద్రి జిల్లాలో పరువుహత్య కలకలం, కూతుర్ని ప్రేమించినందుకు మాజీ హోంగార్డును హత్య చేయించిన మామ, ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

ఇతర రాష్ట్రాల్లో గవర్నర్‌తో విభేదించినా, రాజ్‌భవన్‌ను గౌరవిస్తున్నారు. నేను గవర్నర్‌గా మాత్రమే పనిచేస్తున్నా. నాకు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయం చేస్తున్నానని అనవసరంగా విమర్శిస్తున్నారు. ఆధారాలు లేకుండా విమర్శలా..? (criticisms without any evidence) మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా విమర్శిస్తున్నారు. పాత వీడియోలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నేను ప్రజల సమస్యలను పరిష్కరించటం తప్పా? ప్రజలను కలిస్తే తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. ఏ పదవిలో ఉన్నా, ప్రజలకు సేవ చేయుటం నా లక్ష్యం. గిరిజనుల మంచి కోసం వాళ్ల ప్రాంతాల్లో పర్యటిస్తున్నా. ఇన్విటేషన్లను పొలిటికల్‌గా చూడొద్దని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు.