Christmas, Sankranti holidays dates | Wikimedia Commons

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు శనివారం వరకు సెలవులను పొడగిస్తున్నట్టు (TS Govt extened of holidays) బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. తిరిగి బడులు సోమవారం తెరుచుకోనున్నాయి. తెలంగాణ‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో(Telangana Rains) ఇప్ప‌టికే 3 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని విద్యాల‌యాల‌కు ప్ర‌భుత్వం సెల‌వులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

అయితే 3 రోజులుగా కురుస్తున్న వ‌ర్షాలు ఇంకా తెరిపి ఇవ్వ‌లేదు. మ‌రో నాలుగైదు రోజులు వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తోంది. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోలేదు.

ఇప్ప‌టికే ఈ సెట్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసిన ప్ర‌భుత్వం... రేప‌టి నుంచి మొద‌లు కానున్న ఎంసెట్ ప‌రీక్ష‌ల‌ను కూడా వాయిదా వేస్తూ బుధ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అదే స‌మ‌యంలో విద్యాల‌యాల‌కు మ‌రో 3 రోజుల పాటు సెల‌వులు ప్ర‌క‌టించే దిశ‌గా ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది. బుధ‌వారం సాయంత్రం తాజా వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌పై చ‌ర్చించి ఈ దిశ‌గా ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది. ఇదే జ‌రిగితే... వ‌ర్షాల కార‌ణంగా విద్యాల‌యాల‌కు వ‌రుస‌గా 6 రోజుల పాటు సెల‌వులు ప్ర‌క‌టించిన‌ట్ట‌వుతుంది.