High Court of Telangana | (Photo-ANI)

Hyd, Dec 21: ఎట్టకేలకు సింగరేణి ఎన్నికల నిర్వహణకు (Singareni Elections) తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరిపేందుకు వీలు కలిపిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు వాయిదా వేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్‌ను కొట్టేసింది. సింగరేణికి నాలుగేళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. అయితే ఏడాది నుంచి హైకోర్ట్‌లో (Telangana High Court) సింగరేణి ఎన్నిక వివాదం నడుస్తోంది. ఎన్నికల నిర్వహణపై గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్న హైకోర్టు.. ఇప్పటికే పలుమార్లు ఉత్తర్వులు జారీ చేసింది.

కాళేశ్వరంపై సీఎం రేవంత్, హరీష్‌ రావు మధ్య మాటల యుద్ధం, వెంటనే సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హరీష్ రావు డిమాండ్

అయితే.. కేంద్ర కార్మిక శాఖ ఎన్నికలకు సిద్ధమైంది. ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా విడుదలై.. ఎన్నికల నిర్వహణ కసరత్తులు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల వాయిదా కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్‌ దాఖలుకు ఆదేశించింది. ఆపై పిటిషన్‌పై విచారణ జరుపుతూ వచ్చింది.నేడు తీర్పును వెలువరించింది