COVID19 LOckdown Telangana. | File Photo

Hyd, Nov 21: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో బాంబు కలకలం చెలరేగింది. ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్‌ చేసి చార్మినార్‌ వద్ద బాంబు పెట్టామంటూ వ్యాఖ్యలు చేశారు.బాంబు ఫోన్‌ కాల్‌ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌తో చార్మినార్‌ వద్దకు వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. చార్మినార్‌ పరిసరాలతో పాటు పలు హోటళ్లు, దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. దీంతో స్థానికులు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొనుగోలు కేసు, సిట్‌ విచారణ కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

సాధారణ తనిఖీలేనని పాతబస్తీ పోలీసులు తెలిపారు. ఎలాంటి బాంబు బెదిరింపులు రాలేదని చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, బాంబు ఫోన్‌ కాల్‌ గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అయితే, నిజంగానే బాంబు అమర్చారా? లేక ఎవరైనా పోకిరీ ఇలా ఫోన్‌ చేశాడా? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.