Representative Image of Supreme Court ( Photo Credits: Wikimedia Commons )

Hyd, Nov 21: TRS ఎమ్మెల్యేలకు ఎర కేసులో (TRS MLAs Purchase Case) సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. సింగిల్‌ జడ్జి పర్యవేక్షణ, సిట్‌ విచారణ నిలిపేయాలంటూ ఈ కేసు నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం (supreme court) పక్కన పెట్టింది. సిట్‌ విచారణ కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది.

సిట్‌ విచారణ స్వేచ్ఛగా జరిగేలా అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. సిట్‌పై ఉన్న ఆంక్షలు, నియమ నిబంధనలను సర్వోన్నత న్యాయస్థానం ఎత్తివేసింది. సింగిల్‌ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను నాలుగు వారాల్లో పరిష్కరించాలని జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ధర్మాసనం ఆదేశించింది.కాగా రిమాండ్‌ను సవాల్‌ చేస్తూ ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు.. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. 2017 తర్వాత నవంబరులో తెలంగాణలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. రానున్న 48 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు

దీనిపై జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌తో కూడా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. నిందితుల తరపు న్యాయవాది తన్మయ్​ మెహతా వాదించగా.. తెలంగాణ ప్రభుత్వం తరుపున సీనియర్​ న్యాయవాది దుష్యంత్​ దవే, సిద్ధార్థ్​ లూత్రా వాదనలు వినిపించారు.ఈ మేరకు రామచంద్రబారతి సహా ముగ్గురు నిందితుల పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. విచారణ దశలో ఈ అంశంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. రెగ్యులర్‌ బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించే హక్కు పిటిషనర్‌కు ఉందని కోర్టు సూచించింది. హైకోర్టు బెయిల్‌ ఇస్తుంది కదా అని వ్యాఖ్యానించింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. బండి సంజయ్‌ అనుచరుడు అడ్వకేట్‌ శ్రీనివాస్‌ సోమవారం సిట్‌ విచారణకు హజరయ్యారు. నిందితులకు విమాన టికెట్లు బుక్‌ చేశారని శ్రీనివాస్‌పై అరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ చేతిలో కీలక ఆధారాలు సేకరించింది. అక్టోబర్‌ 26న తిరుపతి నుంచి హైదరాబాద్‌కు సింహయజులు స్వామికి శ్రీనివాస్ టికెట్ బుక్ చేసినట్టు సిట్ గుర్తించింది. ఈ మేరకు శ్రీనివాస్‌కు సంబంధించిన లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఫోన్‌ కాల్‌ లిస్ట్‌ వివరాలు ముందుంచి శ్రీనివాస్‌ను సిట్‌ అధికారులు ప్రశ్నించారు.

ఈ కేసులో నోటీసులు అందుకున్న బిఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామి సిట్ విచారణకు గైర్హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి శ్రీనివాస్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. రామచంద్ర భారతి ఫ్లైట్ టికెట్స్ కొనుగోలుపై శ్రీనివాస్‌ను సిట్ ప్రశ్నిస్తోంది. రామచంద్ర భారతి, నంద కుమార్, సింహ యాజీలతో ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. శ్రీనివాస్ స్టేట్‌మెంట్‌ను సిట్ నమోదు చేసుకుంటోంది.