Hyd, Jan 16: హైదరాబాద్‌లో సంచలనం రేపిన వనస్థలిపురం దోపిడీ కేసును (Vanasthalipuram Robbery Case) రాచకొండ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు (four accused arrested) చేశారు. వారి నుంచి రూ.25 లక్షలు సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ చౌహాన్ మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. ఈ దోపిడీ ఘటన తర్వాత నిందితులు ఇతర రాష్ట్రాలకు పారిపోయినట్లు చౌహాన్ తెలిపారు.
వనస్థలిపురం దోపిడీ కేసులో సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఐదుగురు నిందితులను గుర్తించాం. వారిలో నలుగురిని అరెస్టు చేయగా.. మరొకరు పరారీలో ఉన్నాడని చౌహాన్ తెలిపారు. వీరంతా రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దోపిడీ చేశారని తెలిపారు. బార్ యజమాని వెంకట్ రెడ్డి వద్ద నిందితులు అప్పు తీసుకున్నారు.ఈ అప్పు తీర్చడానికి వచ్చి డబ్బులు కొట్టేయాలని వారు ప్రణాళిక వేశారు.
అందులో భాగంగానే రూ.50 లక్షలు దోపిడీ చేసి, తమతో పాటు తీసుకొచ్చిన 2 బ్యాగుల్లో ఒక బ్యాగు తీసుకొని ముంబయి పారిపోయారు. అక్కడి నుంచి విదేశాలకు వెళ్లిపోవాలన్నది వాళ్ల ప్లాన్. పారిపోయే క్రమంలో నిందితులను పట్టుకున్నామని చౌహాన్ వెల్లడించారు.