IT Minister kTR (Photo-Twitter)

Hyderabad, April 7: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో గల నానక్‌రామ్‌గూడ బీఎస్ఆర్ టెక్ పార్కులో మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ (Telangana Industries Minister KT Rama Rao) బుధ‌వారం ఉద‌యం ప్రారంభించారు. అమెరికాకు చెందిన వైద్య ప‌రిక‌రాల త‌యారీ సంస్థ మెడ్ ట్రానిక్ (Medtronic Engineering & Innovation Cente) రూ. 1200 కోట్ల‌తో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రపంచస్థాయి వైద్య పరికరాల ఇంజినీరింగ్‌, ఆవిష్కరణలు చేయనుంది. దీనిద్వారా హెల్త్‌కేర్‌ రంగంలో ఇంజినీరింగ్‌ చేసినవారికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా మెడ్‌ట్రానిక్‌ (Medtronic Engineering and Innovation Center (MEIC)పనిచేస్తోంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నిర్వహిస్తున్నది. నగరంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రం ద్వారా ప్రారంభంలో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించ‌నున్నాయి. విడుతల వారీగా మరో నాలుగు వేల మందికి ఉపాధి కల్పించనుంది. మెడ్‌ట్రానిక్‌ సంస్థ అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే తన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండటం విశేషం.

inauguration of the MEIC 

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైద‌రాబాద్‌లో గూగుల్‌, అమెజాన్, ఫేస్‌బుక్‌, ఆపిల్ వంటి అగ్ర‌సంస్థ‌లు ఇప్ప‌టికే కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నాయ‌ని తెలిపారు. అమెరికా త‌ర్వాత రెండో కేంద్రాన్ని మెడ్ ట్రానిక్ హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయ‌డం సంతోష‌క‌రంగా ఉంద‌న్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైద‌రాబాద్ అగ్ర‌స్థానంలో ఉంద‌ని పేర్కొన్నారు. మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రం ఏర్పాటుతో హెల్త్‌కేర్‌ రంగంలో ఇంజినీరింగ్‌ చేసినవారికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయ‌ని తెలిపారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నది అని కేటీఆర్ పేర్కొన్నారు.

కాళేశ్వరంలో ప్రాజెక్టులో మరో చారిత్రాత్మక ఘట్టం.. మంజీరాతో అనుసంధానమైన గోదావరి జలం; గజ్వేల్ కాలువలోకి కాళేశ్వరం నీటిని విడుదల చేసిన సీఎం కేసీఆర్

మొద‌ట 1,000 మందికి, భ‌విష్య‌త్తులో మరో 4,000 మందికి ఈ సంస్థ ద్వారా ఉపాధి లభిస్తుంది. అమెరికాకు చెందిన ఈ సంస్థ ప్రపంచ స్థాయి వైద్య పరికరాల ఇంజనీరింగ్, ఆవిష్కరణల రంగంలో కృషి చేయ‌నుంది. అమెరికాలోని మిన్నెసోటా ప్రధాన కేంద్రంగా 140 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది. వాటిల్లో లక్ష మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే, ఆయా దేశాల్లో కేంద్రాలు లేవు. అమెరికా తర్వాత హైద‌రాబాద్‌లోనే రెండో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

2016లో అమెరికాలో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టించి మెడ్‌ట్రానిక్‌ కార్యనిర్వాహక చైర్మన్‌ ఒమర్‌ ఇస్రాక్‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. అనంత‌రం ఆ సంస్థ ప్ర‌తినిధులు తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. నాన‌క్ రాం గూడ‌లో త‌మ సంస్థ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుని ఆ ప‌నుల‌ను పూర్తి చేశారు.