Telangana Early Elections Row: తెలంగాణలో త్వరలో ముందస్తు ఎన్నికలు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్
Telangana BSP chief RS Praveen Kumar (Photo: ANI)

Hyd,, Nov 25: తెలంగాణలో త్వరలో ముందస్తు ఎన్నికలు రానున్నాయని రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 6 నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని తెలంగాణ బీఎస్‌పీ అధ్యక్షుడు తెలిపారు. ఈడీ, ఐటీ సోదాలు టీఆర్ఎస్, బీజేపీలు కలిసి ఆడుతున్న డ్రామాలని ఆయన విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ అధికారి హత్యకు గురి కావడానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని చెప్పారు.

డిసెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు, వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్

52 శాతం ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లను కల్పిస్తే ఎలాగని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈ నెల 26 నుంచి పెద్ద ఎత్తున పోరాడుతామని చెప్పారు. కోటి సంతకాలను సేకరించి రాష్ట్రపతికి పంపుతామని అన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను కూడా పెంచాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని అన్నారు.