Hyderabad, Sep 12: బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని (TS Weather Report) హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కుమ్రం భీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల అతిభార్షీ వర్షాలు కురువవచ్చని వెల్లడించింది. అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి రాబోయే రెండు రోజుల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని వివరించింది.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం (heavy rainfall for next Three days) ఉందని పేర్కొంది. శనివారం కుమ్రంభీం-అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అధికంగా వర్షాలు పడ్డాయని తెలిపింది. ప్రస్తుతం తూర్పు, మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని వివరించింది.
అల్పపీడీనం రాబోయే మూడు రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశలో ఉత్తర ఒడిశా, ఉత్తర చత్తీస్‌ఘడ్‌ల మీదుగా వెళ్లే అవకాశముంటుందని పేర్కొంది. . అల్పపీడనం ఉత్తర ఒడిశా–పశ్చిమబెంగాల్ తీరం వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయువ్య దిశగా పయనించి 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది