
Hyderabad, June 14: తెలంగాణలో రోజూవారీ కోవిడ్ కేసులు నిన్నటికంటే ఈరోజు స్వల్పంగా పెరిగాయి, అయితే కరోనా నుంచి రోజురోజుకి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఆక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 96.03 శాతంగా మెరుగైన స్థితిలో ఉంది.
ఇదిలా ఉంటే పగటి పూట లాక్డౌన్ ఎత్తివేయటం వలన మళ్లీ రోడ్లపై రద్దీ విపరీతంగా పెరిగింది, ప్రజలు భౌతిక దూరాన్ని పాటించడం గాలికొదిలేశారు. వాహనాల రాకపోకలు కూడా విపరీతంగా పెరగడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జాంలు ఏర్పడుతున్నాయి. సెకండ్ వేవ్ పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటుపడుతున్నాయనుకుంటున్న వేళ, ప్రజల నిర్లక్ష్యంతో సెకండ్ వేవ్ తీవ్రత మళ్లీ పెరిగే అవకాశం ఉంది.
ఇక, రాష్ట్రంలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,10,681 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1511 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1479 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,04,880కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 173 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, ఖమ్మం నుంచి 139, నల్గొండ నుంచి 113 మరియు భద్రాద్రి కొత్తగూడెం నుంచి 98 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 12 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,496కు పెరిగింది.
అలాగే నిన్న సాయంత్రం వరకు మరో 2,175 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 5,80,923 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,461 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.