Coronavirus towns (Photo-ANI)

Hyderabad, June 12: తెలంగాణలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1771 పాజిటివ్‌ కేసులు (Coronavirus in Telangana) నమోదు కాగా 13 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,983 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 2384 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 5 లక్షల 76 వేల 487 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 1,20,525 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, తెలంగాణలో ఇప్పటివరకు 1,66,32,289 మందికి కరోనా పరీక్షలు చేశారు.జీహెచ్‌ఎంసీ పరిధిలో 171 కరోనా కేసులు (Coronavirus in GHMC) నమోదయ్యాయి.

సింగరేణి కార్మికులందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ (Covid Vaccine) వేసేందుకు రేపటి నుంచి సంస్థ ఆధ్వర్యంలో మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. పది రోజులపాటు కొనసాగనున్న వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో 29 వేల మందికి టీకాలు వేయాలని నిర్దేశించినట్లు ఆయన పేర్కొన్నారు. సింగరేణి ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, కమ్యూనిటీ హాళ్లలో సిబ్బందికి టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే 16 వేల మంది కార్మికులకు తొలి డోసు టీకా ఇచ్చామని అన్నారు. కార్మికుల ఆరోగ్య సంరక్షణకు సింగరేణి సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎండీ చెప్పారు.

తెలంగాణ బీఎడ్‌ ప్రవేశాల నిబంధనల్లో కీలక మార్పులు, ఇకపై బీఏ, బీకాం, బీఎస్సీ కాకుండా వేరే సబ్జెక్టులు చదివిన వారికి కూడా అవకాశం, జీవో 16 జారీ చేసిన విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా

కరోనా వ్యాక్సినేషన్‌పై 44వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు (TS Minister harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలని ఆయన కోరారు. అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్ ను విదేశాల నుంచి దిగుమతికి చర్యలు‌ చేపట్టాల‌న్నారు. కోవిడ్ 19 చికిత్సకు‌ సంబంధించిన మందులు, ఇతర సామగ్రిపై జీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన పన్నుల సిఫారసులకు మద్ధతు తెలిపారు.

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం, ఈ నెల 19 తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష

అవసరాల‌ తగినంతగా దేశీయంగా కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి కావడం లేదని, దేశ అవసరాల మేరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోని అయినా ప్రణాళికాబద్ధంగా, వేగంగా ప్రజలకు అందించాలని సూచించారు. రెండో దశలో కరోనా సృష్టించిన విలయం, థర్డ్‌ వేవ్‌ కూడా మరింత ఉధృతంగా రానుందన్న అంచనాల మధ్య కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరగా చేపట్టాలన్నారు.