coronavirus in idnia (Photo-PTI)

Hyderabad, May 24: తెలంగాణలో గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 42,526 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,242 పాజిటివ్ కేసులు (TS Coronavirus) వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనూ కరోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 343 కొత్త కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో అత్యల్పంగా 7 కేసులు గుర్తించారు. ఇటీవల కాలంలో ఓ జిల్లాలో సింగిల్ డిజిట్ కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.

ఇక, రాష్ట్రవ్యాప్తంగా 4,693 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, 19 మంది మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 5,53,277 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,09,663 మంది కోలుకున్నారు. ఇంకా 40,489 మందికి చికిత్స కొనసాగుతోంది. అంతేకాదు, పాజిటివిటీ రేటు తగ్గిపోవడమే కాకుండా, రికవరీ రేటు 92.11 శాతానికి పెరిగింది.

ఇక రాష్ట్రంలో కరోనా బారినపడి చనిపోయిన వారికి 5 రూపాయలకే దహన సంస్కారాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ మంత్రి వి.శ్రీనివాసగౌడ్ తెలిపారు. కరోనాతో మృతి చెందిన వారికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మృతదేహాలను అలాగే వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌లో రెండు ఎకరాల స్థలంలో గ్యాస్ ఆధారిత శ్మశాన వాటికను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు.

యాస్ తుఫాను కల్లోలం, వెంటనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి, ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులకు పలు సూచనలు చేసిన ప్రధాని మోదీ

త్వరలోనే శ్శశాన వాటిక పనులు పూర్తయి అందుబాటులోకి వస్తుందన్నారు. మునిసిపల్ కమిషనర్‌కు రూ. 5 చెల్లించడం ద్వారా అక్కడ అంత్యక్రియలు చేసుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు చెప్పారు.

తెలంగాణలో లాక్‌డౌన్ 12వ రోజుకు చేరుకుంది. సోమవారం లాక్ డౌన్ మినహాయింపు సమయాల్లో భాగంగా సిటిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పలుచోట్ల నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. ట్రాఫిక్‎ను పోలీసులు నియంత్రిస్తున్నారు. మినహాయింపు సమయం కావడంతో రోడ్లపై రద్దీ 6 గంటల నుంచే ప్రారంభమైంది. దీంతో నిత్యవసర వస్తువుల కోసం సూపర్ మార్కెట్ల దగ్గర జనాలు బారులు తీరారు.