TS Corona Update: తెలంగాణలో ఆక్సిజన్ అందక ముగ్గురు కరోనా పేషెంట్లు మృతి, రాష్ట్రంలో తాజాగా 4,976 మందికి కరోనా పాజిటివ్, 35 మంది మృతితో 2,739కి చేరుకున్న మరణాల సంఖ్య
Coronavirus scanning at an airport (Photo Credit: PTI)

Hyderabad, May 9: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 55, 358 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,976 మందికి కరోనా పాజిటివ్ (TS Covid Update) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 851 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిస్తోంది. అదే సమయంలో 7,646 మంది కరోనా నుంచి కోలుకోగా, 35 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,739కి (Covid Deaths) చేరింది.

ఇప్పటివరకు తెలంగాణలో 4,97,361 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 4,28,865 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 65,757 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచించారు. కరోనాను నిర్లక్ష్యం చేయొద్దని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరించారు.

కింగ్‌కోఠి ఆస్పత్రిలో ముగ్గురు కరోనా రోగులు మృతి చెందారు. ఆక్సిజన్ సమయానికి అందక రోగులు చనిపోయారు. జడ్చర్ల నుంచి ఆస్పత్రికి రావాల్సిన ట్యాంకర్ ఆలస్యమైంది. ట్యాంకర్ డ్రైవర్ రూటు మర్చిపోవడంతో సమస్య తలెత్తింది. ఈలోపు ఆక్సిజన్ అందక ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. తమ వాళ్ల మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇప్పటీకి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక మరో 20 మంది రోగులు ఇబ్బంది పడుతున్నారు.

కరోనా స్పెల్లింగ్ మారిస్తే దాని పీడ విరగడవుతుందట, కరోనాను ‘CARONAA’ గా కోవిడ్‌ను ‘COVVIYD-19’ మార్చితే చాలట, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనంతపురం ఎస్.వి.అనంద్ రావు బ్యానర్

Here's TS Covid Report

వ‌రంగ‌ల్ జిల్లాలోని వ‌ర్ధ‌న్న‌పేట మండ‌లం ద‌మ్మ‌న్న‌పేట గ్రామంలో విషాద సంఘ‌ట‌న చోటుచేసుకుంది. కొవిడ్‌-19తో వృద్ధ దంప‌తులు మృతిచెంద‌గా వారి కుమారుడి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. రిటైర్డ్ స్కూల్ టీచ‌ర్ వీర‌మ‌ల్ల కృష్ణారెడ్డి(70), అత‌ని భార్య య‌శోధ‌(62) కొవిడ్ బారిన ప‌డి చ‌నిపోయారు. వారి చిన్న కుమారుడు వ‌రంగ‌ల్‌లోని ఓ ఆస్ప‌త్రిలో కొవిడ్‌తో చికిత్స పొదుతున్నాడు. ఇత‌డి ప‌రిస్థితి కూడా విష‌మంగా ఉంద‌ని బంధువులు తెలిపారు.

కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ, హోం క్వారంటైన్‌లో తెలంగాణ మంత్రి, ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ

రాష్ట్రంలో మహారాష్ట్ర, దక్షిణాఫ్రికా, నైజీరియా, యూకే తదితర వేరియంట్లు ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారించారు. ఇందులో మహారాష్ట్ర వేరియంట్‌ ఎక్కువ ఇబ్బందులకు గురిచేస్తున్నది. సెకండ్‌వేవ్‌లో నమోదైన కేసుల్లో 30% పైగా ఈ ర కానికి చెందినవే. సాధారణ లక్షణాలు కనిపించకపోయినా ఊపిరితిత్తులపై తీవ్రప్రభావం చూపిస్తున్నది. వ్యాధిని గుర్తించేలోపే తీవ్ర నష్టం జరుగుతున్నది.