Coronavirus in US (Photo Credits: PTI)

Hyderabad, May 8: తెలంగాణలో గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 69,148 కరోనా పరీక్షలు చేపట్టగా 5,186 పాజిటివ్ కేసులు (TS Covid Report) గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 904 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 7,994 మంది కరోనా నుంచి కోలుకోగా, 38 మంది మృతి (Covid Deaths) చెందారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,92,385కి చేరింది. 4,21,219 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ఇంకా 68,462 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,704కి (Coronavirus Deaths) చేరింది.

వారం కిందట వరకు దాదాపు 8 వేలకు నమోదైన కేసులు ఇప్పుడు ఐదు వేలకు చేరాయి. తెలంగాణ వైద్యారోగ్య శాఖ మళ్లీ సాయంత్రం పూట కరోనా బులెటిన్‌ విడుదల చేయడం ప్రారంభించింది. నిన్నటి వరకు ఉదయం విడుదల చేస్తుండగా తాజాగా సాయంత్రానికి మార్చారు.

కరోనా మాటున మరో పెను ముప్పు, కోలుకున్నవారిపై బ్లాక్‌‌ ఫంగస్‌ దాడి, మ్యుకోర్‌‌మైకోసిస్‌ సోకి చూపును కోల్పోతున్న పేషెంట్లు, ఈ వ్యాధి ఎలా సోకుతుంది, బ్లాక్‌‌ ఫంగస్‌ లక్షణాలు ఎలా ఉంటాయో ఓ సారి తెలుసుకోండి

తాజాగా శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో ఒక్క రోజులో 69,148 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు చేసిన కరోనా పరీక్షలు 1,35,57,646. అత్యధికంగా హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో కేసులు నమోదవుతున్నాయి. అత్యల్పంగా కొమురం భీం ఆసిఫాబాద్‌, నారాయణపేట జిల్లాలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి.

Here's TS Covid Report

ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జర్నలిజం అధ్యాపకుడు ప్రొఫెసర్‌ బాలస్వామి కరోనాతో శుక్రవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. శనివారం గుంటూరు జిల్లా అమరావతిలో అంత్యక్రియలు జరగనున్నాయి. గుంటూరు జిల్లా అమరావతికి చెందిన ఆయన హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో ఎంఏ కమ్యూనికేషన్స్‌ పూర్తిచేశారు. అనంతరం అస్సాంలోని తేజ్‌పూర్‌ వర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పదేళ్లు పనిచేశారు. జర్నలిజంలో పీహెచ్‌డీ చేసిన తొలి దళిత అధ్యాపకుడిగా పేరున్న బాలస్వామి.. 2004లో ఓయూలో ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు.