Hyderabad, May 29: తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ట్విట్టర్లో ఎవరైనా ఆపదలో ఉన్నారని ఆయనకు ట్వీట్ చేస్తే వెంటనే ఆయన రియాక్ట్ అవుతారనే పేరు కూడా ఉంది. అయితే కొన్ని సార్లు ఆకతాయిలు కూడా ట్వీట్ చేస్తుంటారు.తాజాగా ఓ ఆకతాయి తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావుకి ఆసక్తికర ట్వీట్ చేశారు. నా బిర్యానీలో లెగ్ పీస్ మిస్సయింది (Telangana Man Complains About Missing Leg Piece) అంటూ పుడ్ డెలివరీ జొమోటో మీద ఫిర్యాదు చేస్తూ కేటీఆర్ కి ఆ ఆకతాయి ట్యాగ్ చేశారు.
జోమాటోలో ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి బిర్యానీలో లెగ్ పీస్ (Missing Leg Piece in Biryani) రాలేదట,. అలాగే అందులో మసాలా ఎక్కువ ఆర్డర్ చేసినా రాలేదట. ఈ విషయాన్ని అతడు ట్విట్టర్లో (Twitter) పోస్ట్ చేస్తూ..కేటీఆర్ గారు నాకు బిర్యానీలో లెగ్ పీస్ రాలేదు. అలాగే బిర్యానీలో మసాలా ఎక్కువగా వేశారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలంటూ అంటూ కేటీఆర్ కి ట్యాగ్ చేశారు. దీనికి అతడు బిర్యానీ ఫోటోని కూడా పోస్టులో పెట్టాడు. ఈ ట్వీట్ కి స్పందించిన మంత్రి కేటీఆర్ (KT Rama Rao) చాలా ఫన్నీగా బదులిచ్చారు.
Here's KTR Reply Tweet
And why am I tagged on this brother? What did you expect me to do 🤔🙄 https://t.co/i7VrlLRtpV
— KTR (@KTRTRS) May 28, 2021
Sir, he took #AskKTR a bit seriously 😂 pic.twitter.com/V25GgqhPJl
— TechNickGamer (@Technikhil_) May 28, 2021
ఈ ట్వీట్ కి బదులిస్తూ..నన్నెందుకు ట్యాగ్ చేశారు బ్రదర్...ఈ విషయంలో నా నుంచి మీరు ఏమి ఊహిస్తున్నారంటూ రిప్లయి ఇచ్చాడు. దీనికి ఆలోసిస్తున్న సింబల్, అలాగే యాంగ్రీ సింబల్ తో కూడిన ఎమోజీలను జత చేశారు. అయితే ఇది వింత కాదు కాని ఇటువంటి వాటికి కూడా కేటీఆర్ గారు స్పందించడం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆక్సిజన్లు. మందులు, బెడ్స్, ఈ పాసులు వంటి వాటి మీద చాలామందికి కేటీఆర్ ఎంతో ఒపికగా సమాధానాలు ఇస్తున్నారు. ఇలాంటి వాటికి కూడా సమాధానం ఇవ్వడం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.