Hyd, August 3: సికింద్రాబాద్ లోని మారేడుపల్లి ఎస్సై వినయ్ కుమార్‌పై (marredpally si vinay kumar) గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి విధి నిర్వహణలో ఉన్న ఎస్సైపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి (attacked by unknown persons ) చేశారు. తెల్లవారుజామున 2.50 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర రక్తస్రావమైన ఎస్సై వినయ్‌ను హుటాహుటిన సమీపంలోని గీత నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. కడుపు భాగంలో నాలుగు, వెన్నులో నాలుగు కుట్లు వేశారు. ప్రస్తుతం ఎస్సై పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఓంశాంతి టిఫిన్ సెంటర్ ఎదురుగా నైట్ డ్యూటీలో ఉన్న ఎస్సై వినయ్‌కుమార్, మరో పోలీస్ అధికారి సత్యనారాయణతో కలిసి తనిఖీలు నిర్వహిన్నారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు నంబరు ప్లేట్ లేకుండా మోటారు సైకిల్‌తో వస్తుండం చూసి వారిని ఆపి విచారిస్తుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి తన వద్ద ఉన్న చిన్న కత్తితో ఎస్‌ఐ వినయ్ కుమార్‌పై దాడి చేశాడు. కడుపు, వెన్ను భాగంలో పొడిచాడు.
అనంతరం ఇద్దరు దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను లంగర్‌హౌస్‌లోని సంజయ్ నగర్‌లో నివాసముండే పవన్, సంజయ్‌గా గుర్తించారు. నిందితులు పీడీయాక్ట్ కింద జైటుకు వెళ్లి వచ్చిన పాత నేరస్తులుగా గుర్తించారు.
కాగా, వారంరోజుల క్రితం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. దొంగలను పట్టుకునేందుకు మఫ్టీలో తిరుగుతున్న సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, గిరిపై దుండగులు కత్తిలో దాడిచేశారు. ఈ దాడిలో హెడ్‌కానిస్టేబుల్ యాదయ్య తీవ్రంగా గాయడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.