Chinese Goods Destroyed: ఇకపై చైనా వస్తువులను అమ్మే ప్రసక్తే లేదు, నిషేధం విధించిన హైదరాబాద్‌ జనరల్‌ మర్చంట్‌ అసోసియేషన్‌, భారత సైనికులపై చైనా దాడికి నిరసనగా నిర్ణయం
Chinese Goods Destroyed (Photo-ANI)

Hyderabad, June 18: హైదరాబాద్‌ జనరల్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ చైనా వస్తువులపై నిషేదం విధించింది. ఇకపై రాజధానిలో చైనా వస్తువులను అమ్మబోమని అసోసియేషన్‌ (Hyderabad General Merchant Association) తీర్మానించింది. భారత సైనికులపై చైనా దాడికి నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు రామ వ్యాస (Ram Vyasa) తెలిపారు. మేకుల రాడ్‌లతో చైనా దాడి, 76 మంది జవాన్లకు గాయాలు, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపిన ఇండియన్ ఆర్మీ, 15 రోజుల్లో డ్యూటీలో చేరుతారని ప్రకటన

అసోసియేషన్‌లో 800 మంది వ్యాపారులు ఉన్నట్లు తామంతా చైనా వస్తువులు విక్రయించొద్దని నిన్న జరిగిన సమావేశంలో తీర్మానం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. తమ దుకాణాల్లో ఇకపై చైనా సరుకులను అమ్మమని, వాటిని రోడ్ల మీద పారేస్తున్నామని రామ వ్యాస పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైనాకు చెందిన పలు వస్తువులను వ్యాపారులు ధ్వంసం (Chinese Goods Destroyed) చేశారు.

గడిచిన సోమ, మంగళవారాల్లో లఢక్‌ తూర్పు ప్రాంతంలోని గల్వాన్‌ నదీ లోయ వద్ద భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన బాహాబాహి ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 76 మంది గాయపడ్డారు. చైనా సైన్యం చర్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

Here's ANI Tweet

పలు సంస్థలు ఆ దేశంతో కుదిరిన ఒప్పందాలను రద్దు చేసుకుంటుండగా మరికొన్ని సంస్థలు రద్దు విషయమై సమీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రజలు చైనాకు చెందిన వస్తువులను ధ్వంసం చేయడం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.