Hyd, une 3: తెలంగాణ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రాం నకిలీ ఐడీ ఓ బాలిక ప్రాణం (Minor Girl ends life) తీసింది. గుర్తు తెలియని వ్యక్తులు బాలిక పేరిట ఇన్‌స్టాగ్రాం ఐడీ క్రియేట్ చేసి అశ్లీల చిత్రాలు, మెస్సేజ్‌లు చేస్తుండడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య (Minor Suicide) చేసుకుంది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన ముస్లె సాక్షి(17) గత ఏడాది పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటోంది.
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటోంది. ఇటీవల ఆమె పేరు, ఫొటోతో గుర్తు తెలియని వ్యక్తులు ఇన్‌స్టాగ్రాం ఫేక్ ఐడీ క్రియేట్ చేశారు. అశ్లీల చిత్రాలు, అసభ్య మెసేజ్‌లు పోస్టు (harassment by stalker on Instagram) చేస్తున్నారు. గుర్తించిన సాక్షి కు టుంబ సభ్యులకు తెలిపింది. అయినా పోస్టులు కొనసాగుతుండడంతో మనస్తాపం చెంది మే 29న ఇంట్లోనే పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు హైదరాబాద్‌కు రెఫర్ చేయగా.. ఆదిలాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత నెల 30న చనిపోయింది. మృతురాలి తల్లి యశోదాబాయి బుధవారం ఇచ్చోడ పోలీ సులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫేక్ ఐడీ క్రియేట్ చేసినవారి కోసం ఆరా తీస్తున్నారు.