MLC Polls 2021: తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు
Polls 2021 | (Photo-PTI)

Hyd, Dec 10: తెలంగాణలోని 5 జిల్లాల్లోని 6 స్థానాలకు పోలింగ్ (MLC Polls 2021) కొనసాగుతోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మ.2 గంటల వరకు 96.69 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక ఖమ్మం జిల్లాలో మ.2 గంటల వరకు 79.95 శాతం పోలింగ్ జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో మ.2 గంటల వరకు 87.73 శాతం పోలింగ్ జరిగింది. ఖమ్మం జిల్లా MLC ఎన్నికల్లో (Telangana MLC Polls 2021) ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికార పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ధర్నాకు దిగింది.

ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌కేంద్రంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రజాప్రతినిధులందరూ ఓటు వేయాలని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. జిల్లాలో 99 శాతం ఓటింగ్ జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్ధన్‌తో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో 42 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఖమ్మం ఆర్డిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఖమ్మం ఎం పి. నామా నాగేశ్వరరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 భర్త మరో మహిళతో.. చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భార్య, తెలంగాణ జనగామ జిల్లాలో విషాద ఘటన

పోలింగ్‌ కోసం 37 కేంద్రాలు సిద్ధం చేశారు. మొత్తం ఓటర్లు 5, 326 మంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్. లోకల్‌బాడీ కోటాలో మొత్తం 12 MLC స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల సంఘం. అయితే ఇందులో ఆరు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఈ ఆరు చోట్ల అధికార TRS పార్టీ అభ్యర్థులే గెలిచారు. మిగిలిన ఆరు చోట్ల పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఐదు జిల్లాల్లోనూ గులాబీ దళానిదే మెజార్టీగా ఉంది. ఖమ్మం, మెదక్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌ పోటీలో ఉంది. కరీంనగర్‌లో TRSకు రాజీనామా చేసిన మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ పోటీలో ఉండడం ఇంట్రెస్టింగ్ పాయింట్. విజయం ఖాయమైనప్పటికీ TRS జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఓటర్లు చేజారకుండా జిల్లాల వారీగా అందరినీ క్యాంపులకు తరలించింది. ఇవాళ పోలింగ్ కావడంతో రెండు రోజుల ముందే అందరూ జిల్లాలకు చేరుకున్నారు. ఇక 14న ఫలితాలు ప్రకటిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండు స్థానాలు..అనంతపురం, తూర్పు గోదావరి, ప్రకాశం , విజయనగరం , చిత్తూరు జిల్లాలో ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు పోలింగ్.. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. లోకల్‌బాడీ MLC ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. కరోనా నిబంధనలను అనుసరిస్తూ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని ప్రకటిస్తారు.