Telangana Municipal Polls cm-kcr-meeting (photo-Twitter)

Hyderabad, January 05: త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో(Telangana Municipal Polls) టీఆర్‌ఎస్‌దే విజయమని, ప్రజలంతా టీఆర్‌ఎస్‌వైపే(TRS) ఉన్నారని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (Chief Minister K Chandrasekhar Rao)అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపల్‌ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు(MLAs and Ministers,) ఇంటింటికీ తిరుగుతూ వివరించాలని చెప్పారు.

ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యత అంతా పార్టీకి చెందిన స్థానిక శాసనసభ్యులదేనని స్పష్టంచేశారు. తెలంగాణభవన్‌లో (Telangana Bhavan)శనివారం టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి తెలంగాణలో ఎవరూచేయని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు.

ఏ మంత్రి ఇలాకాలోని మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఆయా మంత్రుల పదవులు ఊడిపోతాయని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీకి ఢోకా లేదని, 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని వారికి భరోసా ఇచ్చారు. అన్ని సర్వేలు టీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పోటీ ఇస్తుందన్న అపోహలు వదిలిపెట్టాలని వారికి ధైర్యం చెప్పారు.

ఈ సమావేశానికి సుమారు 300 మంది వరకు ముఖ్యనేతలు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార కార్యక్రమాలపై నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కొత్త, పాత నేతలు అందరూ కలుపుకొని వెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యేలు కూడా వారికి కేటాయించిన మున్సిపాలిటీల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని హితవుపలికారు.