
Hyd, June 22: తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ యుఎస్ లో దారుణ హత్యకు ( Nalgonda resident Nakka Sai Charan shot dead) గురయ్యాడు. నల్గొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నక్కా సాయి చరణ్ కాల్చి చంపేశారు. నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో తెలంగాణ బిడ్డ ప్రాణాలు వదిలారు. సాయి చరణ్ గత రెండేండ్లుగా మేరీల్యాండ్ రాష్ట్రంలోని (Maryland in US) బాల్టిమోర్ ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం తన మిత్రుడిని కారులో విమానాశ్రయంలో వదిలి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. అతనిపై ఓ నల్లజాతీయులు కాల్పులు జరిపారు. మనుషుల మీద దాడి చేసిన ఎలుగుబంటి చికిత్స పొందుతూ మృతి, పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాకనే మృతికి సంబంధించి కారణాలు తెలిసే అవకాశం ఉందని తెలిపిన జూ అధికారులు
అనంతరం యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ R. ఆడమ్స్ కౌలీ షాక్ ట్రామా సెంటర్‌కు అతన్నితరలించారు. అయితే వైద్యులు అప్పటికే చనిపోయారని ధృవీకరించారు. అతని తలపై తుపాకీ గాయం కనిపించింది.కొడుకు చనిపోయాడని అతని తల్లిదండ్రులకు అమెరికా నుంచి సమాచారం వచ్చింది. స్థానిక అధికారులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు తీవ్ర విచారంలో మునిగిపోయారు. కాగా హ్యుందాయ్ టక్సన్ కారులో వచ్చిన 25 ఏళ్ల వ్యక్తి తలపై పిస్టల్‌తో కాల్చి చంపినట్లు గుర్తించారు. హత్య కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.