Representational Image (Photo Credits: Pixabay)

Hyd, Sep 23: తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరులో మూడేళ్ల తర్వాత స్వైన్‌ఫ్లూ కేసు (Swine Flu in Telangana) నమోదైంది. టీచర్స్‌కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలికకు దగ్గు, జలుబు,జ్వరంతో పాటు ఇతర లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్‌లో నాలుగు రోజులపాటు ఉండి చికిత్స చేయించారు. డిశ్చార్జ్ తరువాత శాంపిల్‌ పరీక్షస్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ వచ్చింది.ఈ జిల్లాలో చివరిసారిగా 2019 ఆగస్టులో స్వైన్‌ఫ్లూ కేసు నమోదవగా.. తాజాగా మరొకటి వెలుగులోకి రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇది హెచ్‌1 ఎన్‌1 రకం ఇన్‌ఫ్లూ ఎంజా వైరస్‌ గా వైద్యులు గుర్తించారు. ఇది సోకిన వారిలో ముందుగా దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, ముక్కు నుంచి అదేపనిగా నీరుకారడం, చిన్నపిల్లల్లో వాంతులు, విరేచనాలు అవుతాయి. అయితే ఇవి ఉన్నంత మాత్రాన స్వైన్‌ఫ్లూ అనడానికి వీల్లేదు. ఈ లక్షణాలు ఉంటే మందులు వాడిన 48 గంటల్లో తగ్గకపోతే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించాలి.

నలుగురు టీకాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు, నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో భాగంగా నలుగురికి నోటీసులు, అక్టోబర్ 10న విచారణకు రావాలని స్పష్టం చేసిప ఈడీ

స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో సంచరించరాదు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్‌ ధరించాలి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్న వ్యక్తి తుమ్మిన, దగ్గిన టేబుల్, ఇతర వస్తువుల మీద పడిన తుంపర్ల నుంచి ఇతరులకు సోకుతుంది. చేతులను తరుచుగా శుభ్రం చేసుకోవాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకు ఇది త్వరగా సోకే అవకాశం ఉంది. మధుమేహం, క్యాన్సర్‌ పీడితులు, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, శ్వాస సంబంధిత జబ్బులు ఉన్నవారు, స్టెరాయిడ్స్‌ వాడే వాళ్లకు ఎక్కువగా ఈ ఫ్లూ వచ్చే అవకాశాలు ఉన్నాయి.