Telangana Phone-Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రిమాండ్‌ ఏప్రిల్‌ 12 వరకు పొడిగింపు, కేసుపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం
Former DCP Radhakishan Rao (Photo-Video Grab)

Hyd, April 10: తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రిమాండ్‌ను నాంపల్లి కోర్టు పొడిగించింది. ఏప్రిల్‌ 12 వరకు రిమాండ్‌ విధించిన అనంతరం ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రాధాకిషన్‌రావుకు సంబంధించి వారం రోజుల కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.  ఫోన్ ట్యాపింగ్ కేసు, చంచలగూడ జైలుకు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, 14 రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు

విచారణ సందర్భంగా తనను జైలులో లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతించడం లేదని రాధాకిషన్‌రావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జైలు సూపరింటెండెంట్‌ను సైతం కలవనీయడం లేదని తెలిపారు. దీంతో, పోలీసులను న్యాయమూర్తి పిలిపించి ప్రశ్నించారు. లైబ్రరీలోకి అనుమతించడంతో పాటు సూపరింటెండెంట్‌ను కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం, న్యాయస్థానం ఈ నెల 12 వరకు రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలన విషయాలు బయటకు, కీలక వికెట్‌ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు, జైల్లో చిప్పకూడు తప్పదన్న సీఎం రేవంత్ రెడ్డి

పోలీసులు నెల రోజులుగా ఫోన్ టాపింగ్ కేసు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అధికారులను అరెస్టు చేశారు. మాజీ డీసీపీ రాధా కిషన్ రావు, మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావులు అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హై ప్రొఫైల్‌ కేసు కావడంతో ప్రత్యేక పీపీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.