Hyd, Sep 21: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఖమ్మం బైక్ లిఫ్ట్ హత్య కేసును (Khammam Murder Case) పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ( extra-marital affair suspected)పోలీసులు తెలిపారు.
ప్రధాన నిందితులైన జమాల్ సాహెబ్ భార్య ఇమామ్‌బీ సహా మోహన్‌రావు, వెంకటేశ్, వెంకట్‌లను అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంలో రెండు నెలల ముందే జమాల్ హత్యకు కుట్రపన్నారని తెలిపారు. భర్తను చంపేందుకు భార్య ఇమామ్‌బీ ఇంట్లోనే ఇంజక్షన్ దాచిపెట్టిందని పోలీసులు చెప్పారు. దీంతోనే నిందితుడు అతన్ని హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు.
చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్ ఈ నెల 19న ముదిగొండ మండలం వల్లభి సమీపంలో ఇంజక్షన్ దాడిలో మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న జమాల్‌ను వల్లభి ఆస్పత్రి సమీపంలో ఓ వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. దీంతో అతడిని బైక్‌పై ఎక్కించుకున్నారు. వెనక కూర్చున్న వ్యక్తి ఇంజెక్షన్ ఇవ్వడంతో జమాల్ మృతిచెందారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వివాహేతర సంబంధమే దీనికి కారణమని నిర్ధారించారు.