రేవంత్ రెడ్డి నమ్మకద్రోహి..డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నాడు.. నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తదో చూస్తానని నాగం జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పైసలు ఇచ్చినోళ్ళకి మాత్రమే పార్టీ టికెట్లు ఇస్తుండు. ఎలా రాష్ట్రంలో నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాకుండా ఎన్నికల కోసం పారాషూట్ లో వచ్చిన నాయకులకు టికెట్లు ఇస్తున్నాడని మండిపడ్డారు.
కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి నమ్మకద్రోహం చేసిన వ్యక్తులకు నాగర్కర్నూల్ టికెట్ ఇవ్వడం పెద్ద వింత. తండ్రి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉంటాడు కొడుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంటాడు ఇలాంటి వారికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం రేవంత్ రెడ్డి వ్యవహార శైలికి నిదర్శనం.
పదేళ్లుగా ప్రభుత్వంపై ఎన్నో కేసులు వేసి బీఆర్ఎస్ పార్టీ నాయకుల చేతిలో ఎన్నో తిట్లు తిని ఎన్నో కేసులు అనుభవిస్తున్న తనకు టికెట్ ఇవ్వకుండా వచ్చిన అభ్యర్థికి టికెట్ ఇవ్వడం.ఇదే దామోదర్ రెడ్డిని నేను సపోర్ట్ చేసి ఎమ్మెల్సీగా గెలిపిస్తే 2018లో కాంగ్రెస్ పార్టీ నుండి నేను నిలబడితే నన్ను ఓడగొట్టలని కంకణం కట్టుకొని తిరిగాడు.
Here's Video
రేవంత్ రెడ్డి నమ్మకద్రోహి..డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నాడు.. నాగర్కర్నూల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తదో చూస్తా - నాగం జనార్దన్ రెడ్డి
పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పైసలు ఇచ్చినోళ్ళకి మాత్రమే పార్టీ టికెట్లు ఇస్తుండు.
ఎలా రాష్ట్రంలో నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు… pic.twitter.com/ELOsrVXwD9
— Telugu Scribe (@TeluguScribe) October 17, 2023
అలాంటి దామోదర్ రెడ్డి కుమారుడికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందంటే దేనితో నవ్వాలో అర్థం అవుత లేదు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసిన నాయకులకు ఎంతోమందికి రేవంత్ రెడ్డి మొండి చేయి చూపించాడు. మా లాంటి వాళ్ళ బతుకులను ఆగం చేశాడు. మల్లు రవి, రేవంత్ రెడ్డి వాళ్ల ఎన్నికల కోసం నా ప్రచార రథాలు వాడుకున్నారు.