TS Electricity Bills: బిల్లులు కట్టకుంటే కరెంట్ కట్ చేస్తాం, కరెంట్ బిల్లులు ఎక్కువ రాలేదు అది అపోహ మాత్రమే, క్లారిటీ ఇచ్చిన తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి
Representational Image (Photo credits: PTI)

Hyderabad, June 8: తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ బిల్లులు (TS Electricity Bills) పెరిగాయని సగటున గత రెండు నెలల కన్నా బిల్లులు ఎక్కువ వచ్చాయని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో.. మంత్రి జగదీశ్ రెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చారు. కరెంట్ బిల్లు గురించి ప్రజలు పడుతున్న ఆందోళనపై మంత్రి జగదీశ్ రెడ్డి (Telangana Power Minister Jagadish Reddy) మీడియాతో మాట్లాడారు. కాగా లాక్ డౌన్ సడలింపుల వల్ల కరెంట్ బిల్లు కట్టాల్సిందేనని ప్రభుత్వం స్పష్టంచేసింది. లేదంటే కరెంట్ కట్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. తెలంగాణలో కొత్తగా మరో 92 పాజిటివ్ కేసులు నమోదు; కరోనావైరస్ పట్ల ఆందోళన చెందవద్దు, ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది.. ప్రజలూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి - సీఎం కేసీఆర్

కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయనేది అనుమానం మాత్రమేనని.. బిల్లులు (Electricity Bills) ఏం ఎక్కువ రాలేదని మీడియా సమావేశంలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి అన్నారు. ఈ నెల కరెంటు బిల్లు చూడగానే అందరికీ అనుమానం వచ్చిందని, కానీ పైసా ఎక్కువ రాలేదని చెప్పారు. మూడు నెలల బిల్లు కావడం, ఎండాకాలంలో ఎక్కువ కరెంటు వాడటంతో శ్లాబ్‌లు మారి ఎక్కువ వచ్చినట్టుగా భావిస్తున్నారన్నారు. 3 నెలలు చెల్లించేవారికి 1.5 శాతం వడ్డీ పడుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి వివరించారు. జూన్ నెలలో 30, జూలైలో 40 శాతం, ఆగస్ట్ 30 శాతం చొప్పున రెగ్యులర్ బిల్లుతో కలిపి కట్టాలని సూచించారు. జూన్ నెలలో బిల్లు కట్టాలని, లేదంటే పవర్ కట్ చేస్తామని చెప్పారు. మూడు వాయిదాల్లో కరెంట్ బిల్లు కట్టేవారు ఈఆర్వోలో మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కిస్తీ రూపంలో చెల్లించే కరెంట్ బిల్లు ఇళ్లలో వాడేవారికి మాత్రమేనని నొక్కి వక్కానించారు.

జూన్‌‌లో 30 శాతం, జులైలో 40 శాతం, ఆగస్టులో 30 శాతం చొప్పున రెగ్యులర్‌‌ బిల్లులతో కలిపి కట్టుకోవాలని సూచించారు. అంతేతప్ప ఈ నెల బిల్లు కట్టకపోతే కరెంటు కట్‌‌చేస్తామని మంత్రి జగదీశ్​రెడ్డి హెచ్చరించారు. ఈ కిస్తీల రూపంలో కట్టే బిల్లులను విద్యుత్‌‌సంస్థల వినియోగదారుల కేంద్రాల్లో(ఈఆర్‌‌వో) మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ కిస్తీల విధానం కేవలం ఇండ్లలో కరెంటు వాడే వారికేనని తెలిపారు.

కరెంటు బిల్లులకు స్లాబ్‌‌ జంప్‌ ‌అనేది ఎప్పుడైనా ఉన్నదేనని మంత్రి జగదీశ్​రెడ్డి చెప్పారు. నెల నెలా మీటర్‌‌రీడింగ్‌‌తీసే అవకాశం లేకనే.. ఈఆర్‌‌సీ ఆదేశం మేరకు మూడు నెలల బిల్లును సరాసరి చేసి ఇచ్చామన్నారు. పైగా పేపర్‌‌, కరెన్సీ నోట్లపై కూడా కరోనా వైరస్‌‌వస్తుందన్న ఆందోళనలతో రీడింగ్‌‌తీయడం సాధ్యపడలేదన్నారు.

ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్‌‌కు రూ.18 వేలు, సైదిరెడ్డికి రూ.45 వేలు బిల్లురావడంతో అయోమయానికి గురై తన వద్దకు వచ్చారన్నారు. ఎనర్జీ సెక్రటరీ అజయ్‌‌మిశ్రాకు రూ.21 వేలు బిల్లు వచ్చిందని.. అధికారులు వారందరికీ పూర్తిగా వివరించడంతో అర్థమైందని తెలిపారు. కరెంట్‌‌బిల్లుల్లో తేడాలు, అనుమానాలను ఉంటే నివృత్తి చేయడానికి ప్రత్యేకంగా హెల్ప్‌‌డెస్క్‌‌ఏర్పాటు చేస్తామని చెప్పారు.